కర్నూల్

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 19 : జాతీయ స్థాయిలో చేపట్టనున్న లారీల సమ్మె కారణంగా జిల్లాలో ప్రజలకు నిత్యం అవసరమయ్యే వస్తువుల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రవాణా, పోలీసు, ఆర్టీసీ అధికారులకు సూచించారు. లారీల సమ్మె నేపథ్యంలో గురువారం జేసీ తన ఛాంబర్‌లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లారీల సమ్మె కారణంగా జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆటంకం లేకుండా ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్త సమ్మె అయినప్పటికీ జిల్లాలో పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పాలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లకు నిత్యావసర వస్తువులు ఆగకుండా చూసుకోవాలని డీఎస్‌ఓను ఆదేశించారు. గ్యాస్, పెట్రోలింగ్ ఉత్పత్తులకు ఎలాంటి సమస్య లేదన్నారు. దేశ వ్యాప్త సమ్మె అయినందున జాతీయ రహదారుల్లోనే సమస్య వుంటుందని ఏఎస్పీ షేక్షావలి తెలిపారు. స్థానిక లారీల యాజమానులు ఒక రోజు మాత్రమే దేశ వ్యాప్త సమ్మెకు సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రవాణా సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించి ఆర్‌టీసీకి సమాచారమిస్తే కూరగాయలను ఆర్‌టీసీ బస్సుల్లో రవాణా చేసుకునేందుకు అనుమతించాలని జేసీ ఆర్‌టీసీ రీజినల్ మేనేజర్‌ను ఆదేశించారు. రహదారి భద్రతకు సంబంధించి డివిజన్ స్థాయిలో కమిటీలు తక్షణమే ఏర్పాటు చేయాలని డీటీసీని ఆదేశించారు.
టీడీపీ, బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
* ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి
కర్నూలు సిటీ, జూలై 19:టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రానికి చేసిన మోసాలకు రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ఏటీఎంలు మూతపడితే, సీఎం చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు రోడ్డు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ అంటే హోదా తెస్తామని టీడీపీ ప్రగల్భాలు పలికి చివరికి ప్రజలను ఘోరంగా మోసం చేశాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తున్నది ఒక్క వైసీపీనే అన్నారు. టీడీపీ పాలనలో సుమారు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. అలాగే ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు జాబు కావాలంటే బాబు రావాలని, బాబు అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకూ ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో పేదల ఆకలిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో పేదలకు అన్నం దొరకడం లేదని, ఒకటి ఉంటే మరొకటి ఉండే పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా ఇంతవరకూ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.