కర్నూల్

జలచౌర్యంపై రైతుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడబూరు, ఆగస్టు 14: తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని గంగవరం డిస్ట్రిబ్యూటరీ కింద హెచ్.మురవణి గ్రామ సమీపంలో అక్రమంగా తూము ఏర్పాటుచేసిన నీటిని మళ్లించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి అక్రమంగా ఆయుకట్టుకు నీటి కోసం తూము ఏర్పాటుచేయడంపై మంగళవారం కాలువ పరిధిలోని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్.మురవణి గ్రామ సమీపంలో నాల్గవ కిలో మీటర్ వద్ద ఎమ్మిగనూరు-కోసిగి రహదారిపై మంగళవారం బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సీఐలు దైవ ప్రసాద్, ప్రసాద్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వైకాపా రైతు విభాగం రైతాంగానికి మద్దతు పలికింది. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర యువ నాయకులు ప్రదీప్‌రెడ్డి, జిల్లాప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, ఎస్సీ సెల్ సేవాదల్ జిల్లా కార్యదర్శి తిక్కన్న, రైతు విభాగం జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ హెచ్.మురవణి గ్రామ సమీపంలో గంగవరం కాలువకు అధికార బలంతో టీడీపీ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి గండికొట్టి తూము ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. తూమును తొలగించేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. రైతులకు సాగునీరు సక్రమంగా అందించాలన్నారు. వారం రోజుల్లోగా తూమును తొలగించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.