కర్నూల్

రాష్ట్రంలో పాలన గాడితప్పింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, సెప్టెంబర్ 24:రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, ఇందుకు తాడిపత్రి, అరకు ఘటనలే నిదర్శనమని నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. ఇక సీఎం చంద్రబాబు హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర సోమవారం 3వేల కి.మీ పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. కాటసాని పట్టణంలోని తన నివాసం వద్ద నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీని ప్రారంభించి అవుకుమెట్ట, పాతబస్టాండ్, ఆస్తానం రోడ్డు, పెట్రోల్‌బంకు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తిరిగి తన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ 3వేల కి.మీ పాదయాత్ర పూర్తి చేసి రికార్డు సృష్టించారని అభినందించారు. ఈ శుభసందర్బంగా తాము ఈ నెల 25వ తేదీ పట్టణంలోని తమ నివాసం వద్ద నుంచి పాతపాడు వరకూ, 26న కోవెలకుంట్ల మండలం చిన్నకొప్పెర్ల నుంచి కోవెలకుంట్ల వరకూ, 26న సంజామల మండలం ముదిగేడు నుంచి ఆకుమళ్ల వరకూ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.