కర్నూల్

మెగా సీడ్ పార్కు పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 25:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తంగెడంచలో ఏర్పాటు చేస్తున్న మెగా సీడ్ పార్కులో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం తన ఛాంబర్‌లో మెగాసీడ్ పార్కులో వౌలిక వసతుల అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెగాసీడ్ పార్కులో వివిధ అభివృద్ధి పనులకు రూ. 78.86 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. 29.23 కోట్ల అంచనాతో పంచాయతీరాజ్‌శాఖ, ప్రహరీ నిర్మాణానికి రూ. 11కోట్లతో రహదారులు, భవనాల శాఖ, తాగునీటికి రూ. 5కోట్లతో ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ప్రతిపాదనలు అందించారన్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు నుంచి సాగునీటిని తీసుకొచ్చేందుకు రూ. 25.97 కోట్లతో జనవనరుల శాఖ ప్రతిపాదనలు చేసిందని, జైన్ ఇరిగేషన్, ఏపీ ఐఐసీ సంయుక్తంగా దీనిపై పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అలాగే 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ. 7.66 కోట్లతో ఏపీ ఎస్పీడీసీఎల్ ప్రతిపాదించగా ఇది సరిపోదని 220 కేవీ సబ్‌స్టేషన్ అవసరం అవుతుందని సీడ్ పార్కు అధికారులు కలెక్టర్‌కు విన్నవించగా 220 కేవీ సబ్‌స్టేషన్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. 3 బోర్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. థిమాటికల్ ఆర్చ్‌ను నిర్మించాలన్నారు.
ఓవర్‌లోడ్ వాహనాలపై కేసులు నమోదు చేయండి
* అవసరమైతే లైసెన్స్ రద్దు చేయండి * కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు, సెప్టెంబర్ 25:ఓవర్‌లోడుతో వెళ్తున్న వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం రోడ్డు భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఓవర్‌లోడుతో వెళ్తున్న వాహనాలను పట్టుకుని జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయాలన్నారు. అవసరమైతే వారి వాహనాల లైసెన్స్ రద్దు చేయాలన్నారు. రహదారి ప్రమాదాల్లో గాయపడిన, మరణించిన వారి వివరాలు ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థలో అవసరమైన చోట్ల రోడ్ల విస్తరణ, డివైడర్లు, లైటింగ్, తదితర పనులు చేపట్టాలని కమిషనర్ హరినాథరెడ్డికి సూచించారు. డ్రైవర్లను బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించి డ్రైవింగ్‌కు పంపాలన్నారు. అవసరమైన చోట్ల సివిల్ వర్క్స్ చేపట్టాలన్నారు. ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆర్‌టీసీ ఆర్‌ఎంను కోరగా ఇప్పటికే 2,057 మందికి 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చామని ఆర్‌ఎం చంద్రశేఖర్ తెలిపారు. కరపత్రాల ద్వారా కూడా డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నామని ఆర్‌ఎం తెలిపారు. విధులకు వెళ్తున్న డ్రైవర్లను బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించి ఎవరైతే తాగలేదో వారినే విధులకు పంపిస్తామన్నారు. సబ్ డివిజన్ స్థాయిలో కూడా రోడ్డు భద్రతపై సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
చేనేత, హస్తకళలు శ్రమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలు
* ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 25:దేశ సంస్కృతిలో అంతార్భగమైన చేనేతలు, హస్తకళలు శ్రమైక్య జీవన సౌందర్యానికి ప్రతీకలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కళా భారతి చేనేత, హస్తకళల మేళాలో భాగంగా మంగళవారం నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అఖిల భారత హస్తకళా, చేనేత వస్త్ర ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎస్వీ సతీమణి విజయ మనోహరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ దేశాలకే నాగరికతను నేర్పాయన్నారు. అలాంటి మన సంస్కృతి, సంప్రదాయాలు నేడు పాశ్చాత్య విష సంస్కృతికి బలైపోకుండా దేశ సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు గల వారసత్వ కళలకు చేనేత, హస్తకళలు జీవం పోస్తున్నాయన్నారు. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను మలచిన అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన కళాకారులు, ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన అద్భుత కళాఖండాలను తయారు చేసి నాటి ప్రభువుల ఆదరణ, ప్రోత్సాహంతో ఎంతో గొప్పగా విరాజిల్లాయన్నారు. అయితే నేటి నవీన జీవన స్రవంతిలో ప్రభుత్వాల అరకొర ప్రోత్సాహంతో ప్రజలకు అందుబాటులోకి రాక ప్రజాదరణ కరువై ఎంతోమంది కళాకారులు జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం తర్వాత ప్రధానమైన చేనేత వస్త్ర పరిశ్రమ, ప్రపంచ దేశాలు సైతం అబ్బురపడే కళా నైపుణ్యం గల హస్త కళాకారులు ఎంతోమంది నేడు ఉపాధి కరువై, జీవనోపాధి వెతుక్కోవడం విచారకరమన్నారు. ‘మనం బతుకుతూ పది మందిని బతికించుకుందాం’ అనే సంకల్పంతో చేనేత, హస్తకళాకారుల సంక్షేమం, నిరుద్యోగ, దివ్యాంగుల శ్రేయస్సు కోసం వారి జీవనోపాధికై ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, సమాజ శ్రేయస్సుకై దాదాపు వంద మంది కళాకారులు స్వయం సహాయక సంఘంగా ఏర్పడి కళా భారతి అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారన్నారు. కళా భారతి చేనేత, హస్తకళల సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ కళాకారులు తయారు చేసిన చేనేత వస్త్రాలు, హస్త కళారూపాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి విక్రయాలు జరపడం ద్వారా అటు కళాకారుల జీవనోపాధితో పాటు వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలో లభిస్తాయన్నారు. ఈ ప్రదర్శన ద్వార ప్రత్యక్షంగా దాదాపు వంద మందికి పరోక్షంగా వందలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ఈ ప్రదర్శనను ఈ నెల 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకూ నిర్వహిస్తామన్నారు. ప్రజలు చేనేత హస్తకళలను ఆదరించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.