కర్నూల్

మున్సిపాలిటీ పేర దోపిడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, అక్టోబర్ 11:మేజర్ గ్రామపంచాయతీగా వున్న నందికొట్కూరును మున్సిపాలిటీగా చేసి పన్నుల రూపంలో ప్రజలను దోచుకోవడం తప్ప ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని కాంగ్రెస్‌పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. నందికొట్కూరు పురపాలక సంస్థ పరిధిలో అధిక పన్నులను నిరసిస్తూ బైరెడ్డి పిలుపుమేరకు గురువారం చేపట్టిన ‘క్విట్ నందికొట్కూరు’ ఉద్యమం విజయవంతమైంది. పట్టణ బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా అన్ని దుకాణాలను మూసివేయగా బ్యాంకులు, సినిమా థియేటర్లు కూడా తెరుచుకోలేదు. తొలుత సుబ్బరావుపేటలోని బైరెడ్డి స్వగృహం నుంచి వ్యాపారులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు పాదయాత్రగా బయల్దేరి పట్టణ శివారులో ఏర్పాటు చేసిన సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బైరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అధిక పన్నులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీగా వున్న సమయంలో రూ. 70 వసూలు చేసే పన్ను నేడు రూ. 7వేలుగా వసూలు చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. నందికొట్కూరు మున్సిపాలిటీ కేవలం నాయకుల జేబులు నింపుకునేందుకే పనికొస్తుందని ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పట్టణంలో వేసిన రహదారులే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న అధికార పార్టీ నాయకులు బాగా వున్న రహదారులను తొలగించి అదే స్థానంలో మళ్లీ రహదారులు వేస్తున్నారని, ఉన్న కుళాయి కనెక్షన్‌లను తొలగించి కొత్త వాటిని వేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కేజీ రహదారి విస్తరణలో భాగంగా పట్టణంలో వ్యాపారులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా దుకాణాలు కూల్చారని, పోలీసులు, మున్సిపల్ అధికారులు, అధికార టీడీపీ నాయకుడు కలిసి వ్యాపారులను మోసం చేశారన్నారు. ముందుగా పోలీస్‌స్టేషన్‌ను కూల్చడంతో సామాన్య వ్యాపారులు భయాందోళనకు గురై వారి షరతులకు ఒప్పుకోవడం బాధాకరమన్నారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన కౌన్సిలర్లు ప్రజాధనం లూటీ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. ప్రతి వార్డులో ప్రభుత్వం మంజూరు చేసిన పక్కాగృహాలు, పింఛన్లను అమ్ముకున్నారని, ఇదియేగాక మున్సిపాలిటీలో కాంట్రాక్టు పోస్టింగ్‌లను కూడా రూ. 3లక్షల చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. మున్సిపాలిటీ స్థలాలను కూడా కౌన్సిలర్లు ఆక్రమించుకుని దుకాణాలు నిర్మిస్తున్నారన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికయ్యారా.. లేక ప్రజల సొమ్ము దోచుకునేందుకు కౌన్సిలర్లుగా మారారా.. అని ధ్వజమెత్తారు. నందికొట్కూరులో ఎక్కడ చూసినా కౌన్సిలర్లు కమీషన్‌దారులుగా మారారని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. కేజీ రహదారి విస్తరణతో పాటు, పన్నుల పెంపుపై కోర్టును ఆశ్రయించనున్నామన్నారు. పొదుపు మహిళలు, వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో పన్నుల పెంపును అడ్డుకుంటామన్నారు. నందికొట్కూరు నియోజకవర్గాన్ని ఒక నేత ప్రైవేట్ కంపెనీలా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఇకనైనా ప్రభుత్వం మున్సిపాలిటీపై ప్రజల అభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా తెలుసుకుంటే బాగుంటుందన్నారు.