కర్నూల్

ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మే 17:ఉద్యోగులు సమష్టిగా పని చేసి నష్టాల్లో వున్న ఆర్టీసీని లాభాల బాటలోకి తేవాలని రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ 2014-15 సంవత్సరానికి జిల్లాలో రూ. 70 కోట్ల నష్టాన్ని చవిచూశామని, అయితే ఆ ఏడాది చివరి నాటికి కార్మికుల కృషితో రూ. 8 కోట్ల నష్టాన్ని తగ్గించామన్నారు. సంస్థ చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుందని, కార్మికులు ఈ విషయాన్ని గమనించి సంస్థ మనుగడ కోసం కృషి చేయాలన్నారు. కాలానుగుణంగా మార్పు తేకపోతే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సిన మొత్తాన్ని మూడు విడతలుగా అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 14 మంది ఉద్యోగులకు ఆదర్శ ఉద్యోగులుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సిటిఎం శ్రీనివాసులు, డిఎం కులశేఖరరెడ్డి, ఆర్‌టిసి కార్మికులు పాల్గొన్నారు.