కర్నూల్

జూలై 15లోగా పుష్కరాల పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మే 17:జూలై 15వ తేదీ లోగా పుష్కరాల పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సంగమేశ్వరంలో గతంలో వున్న రెండు పుష్కర ఘాట్‌లను ఆధునీకరించి మరో పుష్కరఘాట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండల పరిధిలోని శాతనకోట, అల్లూరు, మల్యాల, పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్, బీరవోలు, సంకిరేణిపల్లె గ్రామా ల్లో పంచాయతీరాజ్ నిధులతో చేపట్టిన రోడ్లను మంగళవారం కలెక్టర్‌తో పాటు పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు, ఎస్‌ఇ సుబ్బరాయుడు, ఇఇ సురేంద్రనాథ్, డిఇ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పుష్కరఘాట్‌ల వరకూ వెళ్లేందుకు రూ. 60 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. రోడ్లు, ఘాట్‌ల నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు. కృష్ణానది పరివాహక గ్రామాల్లో పుష్కరాల సందర్భంగా పుష్కరశోభ తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాతనకోట, నెహ్రూనగర్ గ్రామాల్లో పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తుల కోసం నదీ పరివాహక ప్రాంతం వరకూ రోడ్డు వేసి వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ సౌకర్యంతో పాటు భక్తుల సౌకర్యం కోసం గదులు నిర్మిస్తున్నామన్నారు. శ్రీశైలంలో పాతళగంగ, లింగాలగట్టు వద్ద పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సున్నిపెంటలో అతిథిగృహం, కమ్యునిటీ హాల్ ఆధునీకరణతో పాటు మరోగది ఏర్పాటు చేస్తున్నామన్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణ కోసం రూ. 2 కోట్లు మంజూరయ్యాయన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ రమణారావు, ఎంపిడిఓ ప్రతాపరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ విజయభాస్కర్ పాల్గొన్నారు.