కర్నూల్

కాపుల ఆర్థికాభివృద్ధికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మే 17: రాష్ట్రంలోని బలిజలు, కాపులు, తెలగ, ఒంటరి కులాల అర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు. నగరంలోని టిజివి కళాక్షేత్రంలో మంగళవారం మేధోమదన సదస్సు నిర్వహించగా ఎమ్మెల్సీ, టిడి పి జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి, కా పు చైర్మన్ రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం కెఇ మాట్లాడుతూ కాపులు శ్రీకృష్ణదేవరాయలు అంతటి తెలివి కలిగి ఉండి, వీరపాండ్య కట్టబ్రహ్మణ అంతటి ధైర్యవంతులన్నారు. చంద్రబా బు పారదర్శక పాలన అందిస్తూనే, ఎన్నికల సమయంలో, పాదయాత్రలో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారన్నారు. అందులో భాగంగా కాపులకు చేసిన వాగ్దానం మేరకు కాపు సంక్షేమ ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా కార్పొరేషన్‌కు మొదటి విడతగా రూ. వంద కోట్లు, 2వ విడతగా రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశారన్నారు. అలాగే కాపులకు ప్రత్యేకమైన కుల వృత్తి లేదని వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవన ప్రమాణాల మెరుగు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ బలిజల పక్షపాతిగా ప్రభుత్వం వారి అభివృద్ధి, సంక్షేమానికి అన్ని విధాలుగా సహాయం చేస్తుందన్నారు. ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సిఎం కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ శిల్పా మాట్లాడుతూ సిఎం చంద్రబాబు బలిజలకు న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కాపు వర్గం ఎదగాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చదువుకున్న వారందరూ ఉద్యోగాల కోసం వెతకకుండా స్వశక్తితో ఎదిగి, కార్పొరేషన్ సేవలు వినియోగించుకోవాలన్నారు. జెసి హరికిరణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే సామాజికంగా ఎదుగుతారని సూచించారు. ఎంఎస్‌ఎంఇ స్కీమ్ కింద ప్రతి ఒక్కరూ సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం కార్పొరేషన్ కింద దరఖాస్తు చేసుకున్న 344 మందికి రూ. 3,13,75,000 సబ్సిడీకి సంబంధించి బ్యాంక్‌లు మంజూరు చేసిన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు రామచంద్రరావు, మురళీ, జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, నగర అధ్యక్షుడు సుంకర విజయశంకర్, ఏపి కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఇడి లాలాలజపతిరాయ్, ఏపి కాపు, బలిజ కుల సంఘాల నాయకులు, పాల్గొన్నారు.