కర్నూల్

బీజేపీకి గుణపాఠం చెబుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, నవంబర్ 15: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం మోదీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను అమలు చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విన్నవిస్తే దాడులకు పాల్పడుతూ భయపెట్టడానికి యత్నిస్తున్నారన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్, డీజల్ ధరలను పెంచి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగువాడీ సత్తా ఏమిటో తెలియ జేయడానికి సీఎం చంద్రబాబు 15 పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి మోదీకి తగిన బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడన్నారు. దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు మోదీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లబకాష్, పర్వేజ్, చంద్రకాంత్, హనుమంతరాయ చౌదరి, సోమిశెట్టి నవీన్, నంద్యాల నాగేంద్ర పాల్గొన్నారు.

ఎమ్మిగనూరులో
మరో అన్న క్యాంటీన్ సిద్ధం

ఎమ్మిగనూరు రూరల్, నవంబర్ 15:- ఎమ్మిగనూరులో మరో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సిద్ధ మైంది. మున్సిపాలిటీకి రెండు అన్న క్యాంటీన్‌లు మంజూరయ్యాయి. రెండింటికీ ప్రభుత్వం రూ. కోటిపైన నిధులు మంజూరు చేసింది. అందులో ఒకటి స్థానిక సోమప్ప సర్కిల్ వద్ద నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రతి నిత్యం ఒకపూట టిఫిన్, రెండు పూటల బోజనం 1500 మంది ఆరగిస్తున్నారు. రెండవ అన్న క్యాంటీన్ శ్రీనివాస టాకీస్ వద్ద నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ క్యాంటీన్ కేవలం వండించే సామానులు మాత్రమే సమకూర్చల్సి ఉంది. రెండవ క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని ఎంతో ఆట్టహాసంగా నిర్వహించాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్యాంటీన్ ప్రారంభమైతే ఇక్కడ చాలా మంది కూలీలతో పాటు నిత్యం దినసరి కూలీలు చేసుకునే వారికి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. రూ.5కే టిఫిన్, రూ.5కే భోజనం ప్రభుత్వ ఏర్పాటు చేస్తుడడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. కేవలం నిరుపేదల కనీసం ఒక పూటైన కడుపు నిండా భుజించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేసింది. దీన్ని ద్వారా ప్రభుత్వ ఉద్దేశ్యం పలించడమే కాకుండా నిరుపేదలకు ఒకపూట కాకుండా రెండు పూటలు భోజనం లభిస్తోంది. అయితే మొదట ప్రారంభమైన సోమప్ప సర్కిల్‌లోని క్యాంటీన్ వద్ద మొదట్లో రద్దీ అధికంగా ఉండేది. రెండు మూడు సార్లు తోపులాట జరిగింది. అలాంటి సమయంలో మున్సిపల్ కమీషనర్ వెళ్ళి జనాన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. తరువాత టోకన్ పద్దతి పెట్టడం వల్ల రద్దీ తగ్గి జనం క్రమంగా వెళ్లి భోజనం చేసి వస్తున్నారు. అంతేకాకుండా వెళ్లిన వారు రెండవ సారి వెళ్లకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.