కర్నూల్

ఏసిబి వలలో విఆర్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మే 17 : ఆదోని రెవెన్యూ భవన్‌లో మంగళవారం హూవనూరు గ్రామానికి చెందిన విఆర్‌ఓ ఎల్లప్ప ఈ పాసు పుస్తకాల కోసం రైతు నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. అందుకు సంబంధించి ఏసిబి డీఎస్పీ మహబూబ్‌బాషా తెలిపిన వివరాలు.. ఆదోని మండల పరిధిలోని హూవనూరు గ్రామానికి చెందిన రైతు నాగేంద్ర, అతడి ఇద్దరు తమ్ములు వారికి పెద్దల నుంచి సంక్రమించిన భూములను పంచుకున్నారు. ఆ భూములకు సంబంధించి నాగేంద్ర ఈ పాస్ పుస్తకాల కోసం విఆర్‌ఓ ఎల్లప్పను ఆశ్రయించారు. దీంతో విఆర్‌ఓ ఒక్కో పాసు పుస్తకానికి రూ. 3 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా చివరకు రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత రైతు నాగేంద్ర ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఏసిబి డీఎస్పీ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో సిఐలు సీతారామరావు, కృష్ణారెడ్డి వారి సిబ్బందితో మంగళవారం ఆదోని రెవెన్యూ భవనం వద్ద నిఘా పెట్టారు. అనుకున్న ప్రకారం నాగేంద్ర విఆర్‌ఓ ఎల్లప్పకు రూ. 6 వేలు లంచం ఇస్తుండగా ఏసిబి అధికారులు తమ సిబ్బందితో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే విఆర్‌ఓపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా విఆర్‌ఓ ఎల్లప్ప హూవనూరుతో పాటు గోనబావి, విరుపాపురం గ్రామాలకు కూడా విఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్నారు.