కర్నూల్

కర్నూలు అసెంబ్లీ సీటు మైనార్టీలకే కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, నవంబర్ 17: వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటును ఏ పార్టీ అయినా మైనార్టీలకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ వౌనార్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ అహమ్మద్ ఆలీఖాన్ అన్నారు. శనివారం ఖడక్‌పుర లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని, కాని రాష్ట్రంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించలేదన్నారు. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిలు కూడా బహిరంగంగా ప్రకటించలేదన్నారు. అయితే టీడీపీ నాయకుల్లో ఉన్న విభేదాల కారణంగా కాంగ్రెస్ టీడీపీతో కలిసి పోయిందని ప్రకటించుకుంటూ వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమన్న రీతిలో ఎవరికి వారు ప్రత్యేకంగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా కులాల వారిగా ఏ కమ్యూనిటీ అయితే ఎక్కువగా ఉంటుందో సర్వే చేసి వాటి ఆధారంగా టికెట్‌ను కేటాయిస్తారన్నారు. కర్నూలులో జనాభాలో 40శాతం మైనార్టీలున్నారని, ఏ పార్టీ అయిన తమ అభ్యర్థిని మైనార్టీలకు కేటాయిస్తేనే గెలుపు సులువవుతుందని, లేకపోతే ఓటమి తప్పదన్నారు. ఇప్పటి వరకు ఈ నియోజక వర్గంలో ఏ పార్టీ ఎక్కువగా గెలిచిందని వాస్తవాన్ని తెలుసుకొని టీడీపీ నాయకులు మసులుకుంటే మంచిదన్నారు. సీబీఐ పేరు వింటే సీఎంకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. 2013 నుంచి బీజేపీతో కలిసి ఉండి రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటు ప్రత్యేక హోదాను ఇస్తామని తిరుపతిలో వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చి వాటిని అమలు చేకుండా ప్యాకేజీ ఇస్తామంటే వాటికి ఒప్పుకొని ఆ తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమాలు ఊపదుంకోవడంతో మాట మార్చాడని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాల పాటు కనపడని ప్రత్యేక హోదా ఇప్పుడు కనపడిందా, దీనికి మోదీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం శోచనీయమన్నారు.

చిరుత సంచారం...
* దాడిలో ఆవు మృతి
కౌతాళం, నవంబర్ 17: మండల పరిధిలోని మదిరే గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి పూజారి నాగరాజు రెరట్లో ఉన్న ఆవుపై దాడి చేసి చంపిందని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థుల నుండి సమాచారం అందుకున్న ఎస్‌ఐ తిమ్మప్ప సంఘటన స్థలాన్ని పరిశీలించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈవిషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారి ఎఫ్‌ఆర్‌ఓ వెంకట సుబ్బుడు మదిరే గ్రామానికి చేరుకొని ఆవు మృతదేహం పడి ఉన్న స్థలాన్ని గమనించి పాదముద్రలను పరిశీలించి ఇది చిరుత పులికాదని తోడేలు లేద హైన వంటి అడవి జంతులు దాడి చేసి ఉంటాయని తెలిపారు. చిరుత సంచరిస్తుందన్న భయంతోగ్రామస్థులు తమ తమ పొలాలకు వెళ్ళడానికి భయాందోళనకు గురవుతున్నారు.