కర్నూల్

చంద్రబాబు నిర్వాకం వల్లే అక్రమ ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మే 17 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వాకం వల్లే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు చేపడుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపి అనంతర వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను రద్దు చేయాని డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత వైఎస్.జగన్ కర్నూలులో చేపట్టిన జలదీక్ష 2వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా మం గళవారం జగన్‌తో పాటు దీక్షలో ఆదో ని, నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, ఐజయ్య, గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సిఎం చంద్రబాబు పట్టిసీమను అనుమతి లేకుండా నిర్మించారన్నారు. ఆయనను చూసే తెలంగాణ సిఎం కెసిఆర్ కృష్ణానదిపై పాలమూరు, దిండి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర విభజన చట్టం లో పొందుపరచలేదని, ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణానదిపై రెండు ప్రాజెక్టులు నిర్మించాలని తెలంగాణ ప్రభు త్వం ప్రయత్నం చేస్తుందని, అవి పూర్తయితే కృష్ణా డెల్టాలతో పాటు రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ప్రధాని మోదీ ముందు చంద్రబాబు దోషిగా మారారని, దీంతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి చంద్రబాబుకు మోదీ దగ్గర మాట్లాడే ధైర్యం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రైతుల నుంచి అక్రమంగా భూములు లాక్కొని ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వచ్చిన డబ్బుతో వైకాపా ఎమ్మెల్యేలను మభ్యపెట్టి కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా వైకాపాకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ సిఎం చంద్రబాబు అక్రమంగా సంపాదించిన డబ్బుతో సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు చేసిన వాగ్దానాలను అమలు చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ వారిని రోడ్డున పడేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని అమరావతి పేరుతో నిరంతరం విదేశాల్లో తిరుగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచ స్థాయిలో గర్వించే విధంగా రాజధాని నిర్మాణం చేపడుతున్నానని గొప్పలు చెబుతూ ప్రజా సమస్యలను, అభివృద్ధిని గాలికి వదిలేశారని, త్వరలోనే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, నగర కన్వీనర్ నరసింహులుయాదవ్, పాల్గొన్నారు.