కర్నూల్

మళ్లీ రాజుకున్న రాజోలి జల జగడం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మే 17: రాజోలి బండ ఆనకట్ట అర్ధ అడుగు పెంచే విషయంలో కర్నాటక ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆనకట్ట పెంచడానికి సన్నాహాలు చేయడంతో కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ రాజోలి రగడ రాసుకుంది. గతంలో కర్నాటక అధికారులు రాజోలి బండ ఆనకట్టను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే రాష్ట్ర అధికారులు అడ్డుకోవడంతో వెనుతిరిగిన విషయం విదితమే. తాజాగా సోమవారం రాత్రి కర్నాటక అధికారులు ఆనకట్టపై అర్ధ అడుగు పెంచడానికి యంత్రాలతో రావడంతో ఆదోని ఆర్డీఓ ఓబులేసు, డిఎస్‌పి శ్రీనివాసరావు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వెళ్ళి కర్నాటక అధికారుల నిర్మాణాలను అడ్డుకున్నారు. ప్రస్తుతం రాజోలి బండ వద్ద పోలీసు పికేటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కర్నాటక అక్రమ కట్టడాలకు మరో తెలుగు రాష్టమ్రైన తెలంగాణ నాయకులు వంత పాడడంపైన సీమ ప్రాంతం ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ నాయకులు, రైతులు వచ్చి ఆర్డీఎస్ ఆనకట్టకు ఉన్న రివర్స్‌వెట్స్‌ను, నదిలోకి పూడిక పెరగకుండా ఉండే సెటర్స్‌ను మూసే ప్రయత్నం చేశారు. దీంతో సీమ, తెలంగాణ రైతులకు, నాయకులకు మధ్య ప్రాజెక్టు వద్దనే జలయుద్ధం జరిగింది. చాలా మందికిగాయలైనాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండడంతో ఓట్ల కోసం తెలంగాణ ప్రాంతానికే నాయకులు వత్తాసు పలికారు. సీమకు అన్యాయం జరిగింది. రాజోలిబండ ఆనకట్ట నీటి వాటాలో గత 40 సంవత్సరాల నుంచి సీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది. వాస్తవానికి స్వాతంత్య్రం రాక మునుపు 1942లో మద్రాస్, నైజాం, మైసూర్ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రామ్‌మూర్తి, నవాజ్ యార్‌జంగ్, కెసిరెడ్డిలు కలిసి ఒప్పందం కూదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం సీమ ప్రాంతానికి ఉపయోగ పడే కూడి కాల్వద్వారా 78 వేల 24 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు ఉపయోగ పడే ఎడమ కాల్వద్వారా 87 ఎకరాలకు, కర్నాటకకు ఉపయోగ పడే ఎడమ కాల్వద్వారా కర్నాటకు ఒక టిఎంసిని 5647 ఎకరాలకు 16.9 టిఎంసిల నీటిని కేటాయించారు. అయితే కుడి కాలువ నిర్మాణం అసలు జరగలేదు. కుడివైపు ఉన్న మూడు స్లూయిస్ ద్వారా కింది బాగాన ఉన్న నదికి నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు సుంకేశుల ప్రాజెక్టుకు చేరుతుంది. అయితే 5647 ఎకరాలకు ఒక టిఎంసి నీటిని వాడుకోవాల్సిన కర్నాటక 6 టిఎంసిల నీటిని వాడుకుంటూ వేలాది ఎకరాల పంటలు పండిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఐజ, గద్వాల, ఆర్‌ఎస్ కాలువ మొదలగు ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుకు నీరు అందడం లేదు. కాని తెలంగాణ నాయకులు మాత్రం అక్రమంగా నీటిని వాడుకుంటన్న కర్నాటకను వదిలి సీమ ప్రాంతంపైన విమర్శలు చేస్తున్నారు. కర్నాటక, తెలంగాణకు వెళ్లే ఎడమ కాల్వ దాదాపు 30 కిలో మీటర్లు కర్నాటకలో ఉంది. అందువల్ల కర్నాటక జలచౌర్యం చేస్తూ అక్రమంగా వేల ఎకరాలను పండిస్తోంది. అంతేకాకుండా కర్నాటక ప్రభుత్వం రాజోలిబండ వద్ద జల విద్యుత్ కేంద్రం నిర్మించడానికి పూనుకుంది. కాని రైతులు కోర్టుకు వెళ్లడంతో జల విద్యుత్ కేంద్రం నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. ఈవిధంగా గత 40 సంవత్సరాల నుంచి రాజోలిబండ జల వివాదం కొనసాగుతుంది. అక్రమ నీటిని మరింత వినియోగించుకోవడానికి కర్నాటక రాజోలిబండ ఆనకట్ట ఎత్తును పెంచడానికి చాలా ఏళ్ళు నుంచి కనే్నసి ఉంది. కర్నాటక జలచౌర్యాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు ఎదుర్కొని అడ్డగించాల్సిదిపోయి తెలంగాణ నాయకులు కర్నాటకను వదిలి సీమ ప్రాంతంపై విమర్శలు చేయడం విస్మయాన్ని కల్గిస్తోంది. ఇప్పటి కూడి కాలువకు కేటాయించిన నీటిని వినియోగించుకోక పోవడంతో సీమ ప్రాంతంలో వేలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి. అయితే కృష్ణ ట్రిబ్యునల్ విచారణ జరిపిన బ్రిజేష్ కుమార్ కమిటీ ఆ రాజోలిబండ ఆనకట్ట నుంచి సీమకు 5 టిఎంసిల నీటిని కేటాయించింది. అధికారులు 5 టిఎంసిల నీటిని ఉపయోగించుకునే కుడికాలువ నిర్మాణం రిపోర్టును తయారు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కర్నాటక రెండు రాష్టల్రతో చర్యలు జరపకుండా ఏక పక్షంగా రాజోలిబండ ఆనకట్ట ఎత్తు పెంచడానికి ఎలాంటి సమాచారం లేకుండా దొంగ చాటుగా చర్యలు తీసుకోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దశలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌కుమార్ రాజోలిబండ ప్రాజెక్టు సమస్యను పరిష్కరించకపోతే సాగర్ నుంచి నీటిని విడుదల చేయమని ప్రకటనలు చేయడం దారుణం. తెలంగాణ ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులు కర్నాటక జలచౌర్యం, అక్రమ ఆయకట్టపై కర్నాటకను మెడలు వంచాల్సిన విధిని వదిలి ఎలాంటి సమస్యలేని సీమ ప్రాంతం నీటి వనరులకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించడం తగదు. ఆనకట్ట ఎత్తు పెంచితే కర్నాటకకే మేలు జరుగుతుంది. ఇది తెలంగాణ నాయకులు గ్రహించడం లేదు. వాస్తవానికి రాజోలిబండ ఆనకట్ట అంశంపై చట్టం ప్రకారమే సీమ ప్రాంతం వాటాను వినియోగించుకుంటుంది. కాని తెలంగాణ నాయకులు మాత్రం రాజోలిబండపైన వివాదాన్ని లేపి సీమ ప్రజలపైన జలచౌర్యం నింద వేస్తున్నారు. కర్నాటక జలదోపిడిని అడ్డుకోకుండా తెలంగాణ నేతలు చేష్టలుడిగి పోయారు. కాబట్టి కర్నాటకను ప్రశ్నించడం లేదు. తెలంగాణ ప్రాంతం నేతలు సీమ ప్రాంతం నేతలుకలిసి కర్నాటక జలచౌర్యానికి ప్రాజెక్టు ఎత్తు పెంచే చర్యను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో కర్నాటక ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల రగడ భగ్గుమంటూనే ఉంటుంది.