కర్నూల్

‘ఆదరణ’ అమలులో రాష్ట్రంలోనే నందికొట్కూరు ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, డిసెంబర్ 10:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదరణ పథకం అమలులో నందికొట్కూరు మండలం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మొదటి విడతలో ఆదరణ పథకం గురించి అవగాహన పొందిన ప్రజలు రెండవ విడత కింద 2,425 మంది ఆదరణ పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికీ కూడా పరికరాలు వచ్చేలా జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు. అదేవిధంగా జిల్లాలోనే ప్రప్రథమంగా అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసిన ఘనత నందికొట్కూరు మండలానికే దక్కిందన్నారు. ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుతో పల్లెలు పట్టణాల వలే వెలిగిపోతున్నాయన్నారు. వీటితో మండలానికి టెన్‌స్టార్ రేటింగ్ దక్కిందన్నారు. ఇక జలధార పేరుతో ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రూ. 22,300 కోట్లతో పనులు ప్రారంభించాలని ఆదేశించారన్నారు. ఈ పనులు కూడా నందికొట్కూరు నియోజకవర్గంలో నీటి సమస్య వున్న గ్రామాల్లో మొదట ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణం పూర్తి చేశామన్నారు. 10.బొల్లవరం గ్రామంలో బీసీ కాలనీలో నీటి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఓహెచ్‌ఆర్ ట్యాంకు నిర్మాణం కోసం రూ. 35 లక్షలు మంజూరు చేశారని, పనులను త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. గ్రామాల్లో అర్హులందరికీ గోకులం షెడ్లు నిర్మిస్తున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే నందికొట్కూరు మండలం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.