కర్నూల్

సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, డిసెంబర్ 11:ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. అలాగే రాత్రి మండల పరిధిలోని చిన్నభూంపల్లి గ్రామంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉదయం రైతులకు సాగునీరు అందించే పులికనుమ మ్యాప్‌ను పరిశీలించి అక్కడ జరిగే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం గ్రామదర్శిని నిర్వహించే చిన్నభూంపల్లి గ్రామానికి వెళ్లి అక్కడ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే గ్రామంలో విస్తృతంగా పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలపాలని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానని కలెక్టర్ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో ఉన్న మహిళలతో కూడా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలతో కలిసి గ్రామమంతా తిరిగి పరిశీలించారు.
టీఆర్‌ఎస్ గెలిచినందుకు కాదు..
కూటమి ఓడినందుకు సంతోషం
* ఎమ్మెల్యే ఐజయ్య
మిడుతూరు, డిసెంబర్ 11:తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలవడం కంటే కూటమి ఓడినందుకే తమకు ఎక్కువ సంతోషంగా వుందని ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. ఎమ్మెల్యే ఐజయ్య మంగళవారం పట్టణంలోని తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయించిన వారికి డిపాజిట్ దక్కకుండా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశాడని, మరి ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన విషయం చంద్రబాబు మరచిపోయాడా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడంతోనే కాంగ్రెస్‌కు చావుదెబ్బ తగిలి, టీఆర్‌ఎస్ విజయం నల్లేరుపై నడక అయిందన్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ రైతులకు రుణమాఫీ చేయని సీఎం చంద్రబాబు అక్కడ రైతులను ఆదుకుంటానని చెబితే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు.