కర్నూల్

అటవీ శాఖలో 500 పోస్టులకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, జనవరి 18: అటవీ శాఖలో 500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని, అందుకు సంబంధించి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పరీక్షలను అతి త్వరలో నిర్వహించబోతున్నామని, ఆంధ్రప్రదేశ్‌లో 5.8 శాతం అడవి కూడా పెరిగిందని హెడ్ ఆఫ్ ఫారెస్టు ఫోర్స్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఫోర్స్ డా.మహ్మద్ ఇలియాజ్ రిజ్వా తెలిపారు. శుక్రవారం ఆయన మహానంది సమీపంలోని పర్యావరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వన విహారి పార్కును ప్రారంభించారు. అనంతరం పర్యావరణ కేంద్రాన్ని, అందులో విద్యార్థులకు బోధించే పరికరాలను ఆడిటోరియంను, నర్సరీని, ఎకోటూరిజం అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులకు సూచనలు, సలహాలు జారీ చేశారు. పార్కులో పర్యాటకుల వసతుల కొరకై మరిన్ని మార్పులు చేయాలన్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మహానందికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించుటకై బొటానిక్ గార్డెన్, బట్టర్ ఫ్లై పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు. పర్యావరణ కేంద్రం ముందు భాగంలో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలకు మిని క్యాంటీన్‌ను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. అటవీ శాఖ అభివృద్ధికి నిధుల కొరత లేదని, పుష్కలంగా నిధులు ఉన్నాయన్నారు. మహానంది మార్గం వెంట పర్యావరణ కేంద్రం, ఏకో టూరిజం బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో 40 ప్రాంతాల్లో నగర వనం టెంపుల్ పార్కులు, ఏకో టూరిజం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోటప్పకొండ క్షేత్రంలో పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, దీనిపై ప్రభుత్వం మంచి ఆసక్తి చూపిందన్నారు. ప్రజలు చైతన్యమై గ్రీన్ పార్కును పెంపొందించాలని, ప్రతి మనిషి ఏడాదికి రెండు చొప్పున మొక్కలు పెంచితే పర్యావరణాన్ని రక్షించవచ్చన్నారు. వీఎస్‌ఎస్‌ల ద్వారా గిరిజనులకు జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రొటక్షన్ వాచర్లుగా, అటవీ రక్షణకై వారికి ఉద్యోగ భృతి కల్పిస్తున్నామన్నారు. వన్యప్రాణుల రక్షణకు అడవిలో సోలార్ విధానంలో సాసర్ కిట్లు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అడవిలో జంతుజాతి బాగా పెరిగిందన్నారు. అడవిని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా వారి సర్వే ప్రకారం, సూచనల ప్రకారం అడవిని నిప్పు నుండి కాపాడుతున్నామన్నారు. 2018-19కి గాను కంప నిధులు రూ.120 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. భారతదేశంలో 2017-18 చేసిన చర్యల్లో భాగంగా ఒక శాతం అడవి పెరిగిందని, ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే 5.8 శాతం అడవి పెరిగి మొత్తం 20141 చ.కి.మీ.ల అడవి పెరిగిందన్నారు. ఇదే సంవత్సరానికి గాను ప్రభుత్వం 8600 హెక్టార్లలో మొక్కల పెంపకం లక్ష్యాన్ని ఇస్తే 9500 హెక్టార్లలో 27.5 కోట్ల మొక్కలను పెంచే కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. అటవీ శాఖలో ఉండే ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్‌సీ ద్వారా పరీక్షలు జరుపుతున్నామన్నారు. రేంజ్ ఆఫీసర్ పోస్టులకు పరీక్షలను త్వరలోనే నిర్వహిస్తున్నామని, ఫారెస్టు బీట్ ఆఫీసర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. మహానంది వన విహారి పార్కును, ఏకో టూరిజం పార్కును రూ.10 లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. అలాగే అడవిలోని మూడువాగుల గడ్డను పరిశీలించి వన్య ప్రాణుల సంరక్షణకు, అటవీ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వరుస కరువులు!
* వలసలతో ఖాళీ అవుతున్న పల్లెలు..
* ఇళ్ల వద్ద బిక్కుబిక్కుమంటున్న వృద్ధులు..
పెద్దకడబూరు, జనవరి 18: వరస కరువులతో పల్లెలు విలవిలలాడుతు ఖాళీ అవుతున్నాయి. తినడానికి తిండి కరువై పల్లె ప్రజలు, కూలీలు, రైతులు పొట్టచేతపట్టుకుని పట్టణాలకు, నగరాలకు వలస వెళ్తున్నారు. నడవలేని వృద్ధులు ఇళ్లవద్ద బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఏ పల్లెకు వెళ్లినా ఇళ్లకు తాళాలు, ముసలివారు దర్శనమిస్తుంటారు. ఈ సంఘటన మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో చోటుచేసుకుంది. శుక్రవారం మండల పరిధిలోని హులికన్వి గ్రామంలో 200 మంది కూలీలు, పెద్దకడబూరులో 200 మంది కూలీలు జీవనోపాధి కోసం మూటాముళ్లను నెత్తినపెట్టుకుని గుంటూరుకు లారీలలో వలసబాట పట్టారు. దీంతో గ్రామంలో ఇళ్ల వద్ద ఉన్న వృద్ధులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్రామంలో ఎక్కువగా ఇళ్ళకు తాళాలు వేసిన దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. పాఠశాలలో చదువుకొనే పిల్లలను సైతం తమ వెంటబెట్టుకొని వలసలు వెళ్లడంతో చదువులు కుంటుబడుతున్నాయి. గత ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసిన పంటలు వర్షాభావ పరిస్థితుల మూలంగా పూర్తిగా ఎండిపోవడంతో రైతులు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి చేసేదిలేక రైతులు వలసబాట పట్టారు. హులికన్వి గ్రామ శివారులలో ఉన్న పులికనుమ ప్రాజెక్టు నిర్మాణానికి హులికన్వి గ్రామ రైతులు వందల ఎకరాల భూములు ఇచ్చినా తమ గ్రామానికి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తమకు వలసలే శరణ్యమని కూలీలు వాపోయారు. పేరుకు మాత్రమే తమ గ్రామపేరు మీదుగా పులికనుమ ప్రాజెక్టును నిర్మించారని, తమ పొలాలకు సాగునీరు ఇవ్వడానికి అధికారులుగానీ, పాలకులుగానీ కృషి చేయకపోవడంతో తమకు ప్రతి ఏడాది వలసలే దిక్కౌతున్నాయన్నారు. కరువును దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు కరువు సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఉపాధి హామీ పనులను అమలు చేస్తాం వలసలు వెళ్లవద్దని చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమైయ్యాయి. ఇప్పటి వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి పనులు చేసిన కూలీలకు రూ.90లక్షల వేతనాలు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోక పోవడంతో ఉపాధి పనులకు వెళ్లెందుకు కూలీల ఆసక్తి చూపడంలేదు. పెండింగ్ వేతనాల కోసం పలుమార్లు ఆందోళనలు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే గ్రామాలన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
డీఎంఎఫ్ నిధులతో అభివృద్ధి
* న్యూఢిల్లీ పీఎంకేకేవై వర్క్‌షాపులో కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు, జనవరి 18:జిల్లా మినరల్ ఫండ్(డీఎంఎఫ్)తో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నామని కలెక్టర్ సత్యనారాయణ వివరించారు. న్యూఢిల్లీలోని డా. షిండే సింపోజియం హాలులో శుక్రవారం జిల్లా మినరల్ ఫౌండేషన్, ప్రధానమంత్రి ఖనిజ్ క్షత్రియ కల్యాణ్ యోజన(పీఎంకేకేవై)పై జాతీయ స్థాయి వర్క్‌షాపు జరిగింది. అందులో కలెక్టర్ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఎంఎఫ్ నిధుల వినియోగం గురించి వివరించారు. జిల్లాలో 53 మండలాలు ఉండగా అందులో 34 మండలాలు, 211 గ్రామాలు మైనింగ్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. 2017 నుంచి 2018 డిసెంబర్ వరకూ మైనింగ్ ద్వారా రూ. 116 కోట్లు వచ్చిందన్నారు. ఈ నిధులతో చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో 2,965 వివిధ పనులను మంజూరు చేసి అందులో 480 పనులు పూర్తి చేశామన్నారు. మిలిగిన 1,716 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. విద్య, స్ర్తి, శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్, తదితర శాఖల ద్వారా వివిధ అభివృద్ధి పనులకు డీఎంఎఫ్ నిధులను వినియోగిస్తున్నామన్నారు. జడ్పీ హైస్కూళ్లు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రూ. 13.35 కోట్ల వ్యయంతో 299 వర్చ్యువల్ తరగతి గదులు ఏర్పాటు చేశామన్నారు. ఈ చర్యల వల్ల గత విద్యా ఏడాదితో పోల్చుకుంటదే ఈ సంవత్సరం 13,151 మంది విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. అలాగే రూ. 3.94 కోట్ల వ్యయంతో 49 అదనపు తరగతి అదులు, రూ. 6.4 కోట్లతో 43 పాఠశాలల్లో మేజర్ మరమ్మతులు, రూ. 1.34 కోట్లతో 184 పాఠశాలల్లో విద్యుద్దీకరణ పనులు, 10వ తరగతి విద్యార్థులకు విజయదీపిక పేరిట తెలుగు, ఆంగ్ల భాషల్లో ముద్రించి పంపిణీ చేశామన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, హైస్కూల్స్‌లో విద్యార్థుల సౌకర్యార్థం 563 సైంటిఫిక్ మూవింగ్ గ్లోబులు పంపిణీ చేశామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఓడీఎఫ్ కింద 10శాతం వాటాతో రూ. 30లక్షలు ఖర్చు చేసి 1004 టూయిలెట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోని 1034 గంన్‌వాడీ కేంద్రాల్లో రూ. 17 లక్షలు ఖర్చు చేసి విద్యుద్దీకరణ పనులు చేపట్టడం వల్ల పిల్లల నమోదు శాతం పెరిగిందన్నారు. అంతేకాక అగిపోయిన 6 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాల కోసం రూ. 12లక్షలు ఖర్చు చేసి పూర్తి చేశామన్నారు. ఆదోని రూరల్‌లో 226, ఆలూరులో 234 అంగన్‌వాడీ కేంద్రాలు, ఐటీడీఏ శ్రీశైలం పరిధిలోని 42 చెంచుగూడెంలలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్న పిల్లలకు కొర్ర పాయసం అందిస్తున్నామన్నారు. దీంతో అనీమియా లెవెల్స్‌ను 85 శాతం నుంచి 62.5 శాతానికి తగ్గించగలిగామన్నారు. 73 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో రూ. 1.27 కోట్లతో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి రక్షిత తాగునీరు అందిస్తున్నామన్నారు. రూ. 92.91 కోట్లతో 629 సీసీ రోడ్లు, పంచాయతీరాజ్ సర్కిల్ కింద రూ. 25.68 కోట్లతో 106 పనులు చేపట్టి 93 పనులను పూర్తి చేశామన్నారు. 3 పనులు వివిధ దశల్లో ఉన్నాయని, 10 పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. ఎస్సీ కాలనీల్లో ఇళ్ల మీదుగా ఉన్న విద్యుత్ తీగలను మార్చేందుకు రూ. 22 కోట్ల వ్యయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.

18 కెఎన్‌ఎల్ 3
న్యూఢిల్లీలో జరిగిన వర్క్‌షాపులో ప్రసంగిస్తున్న కలెక్టర్ సత్యనారాయణ

కోడుమూరు టీడీపీలో వర్గ విభేదాలు!
* వేర్వేరుగా ఎన్టీఆర్ వర్ధంతి
కోడుమూరు, జనవరి 18:కోడుమూరు టీడీపీలో మరోమారు వర్గవిభేదాలు బహిరంగమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని శుక్రవారం రెండు వర్గాల నేతలు వేర్వేరుగా నిర్వహించారు. అందులో భాగంగా ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ పాతబస్టాండ్‌లోని టీడీపీ జెండా కట్ట వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ చైర్మన్ ఆకెపోగు ప్రభాకర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారిద్దరూ వేర్వేరుగానే పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావంతోనే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని, పేదవాడి కడుపు నింపేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. 2కే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన ఘనత టీడీపీకే దక్కిందని గుర్తుచేశారు. ఆ తర్వాత రెండు గ్రూపుల నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు.
బెళగల్‌లో..
సి.బెళగల్ : సి.బెళగల్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సభను టీడీపీ శ్రేణులు వేర్వేరుగా నిర్వహించాయి. ముందుగా ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్, ఎంపీటీసీ సభ్యులు యాకోబు, ఎస్‌ఎం బాషా, వీరన్నగౌడ్ కూడా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ హయంలో సాధించిన ప్రగతి గురించి వివరించారు.
పొత్తుకు, మద్దతుకు
తేడా తెలియదా?
* ఎమ్మెల్యే ఐజయ్య
నందికొట్కూరు, జనవరి 18:ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార టీడీపీ నాయకులకు మతిభ్రమిస్తున్నట్లు వుందని, పొత్తుకు, మద్దతుకు కూడా తేడా తెలియడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఐజయ్య శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తమ పార్టీ అధినేత జగన్‌ను కలిసి చర్చించారన్నారు. అయితే టీడీపీ నాయకులు ఈ అంశాన్ని తప్పు పట్టటం సబబు కాదన్నారు. వైసీపీ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా వుందన్నారు. అసలు టీఆర్‌ఎస్ పార్టీ ఇక్కడ ఎలా పోటీ చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారని, గతంలో జనసేనపార్టీ, సీపీఎం, బీజేపీతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న సీఎం చంద్రబాబు తెలంగాణలో కృష్ణా జలాలపై ఆ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొడుతున్నారని విమర్శించారు.
బంద్‌లో మీ సేవ కేంద్రాలు..
* ప్రజలకు ఇక్కట్లు
మిడుతూరు, జనవరి 18:ప్రభుత్వం నుంచి ప్రజలకు అందించే ప్రతి కార్యకలాపాలకు మీసేవ కేంద్రాలను అనుసంధానం చేయడంతో నేడు ప్రతి పనికి మీసేవ కేంద్రాలకు పరుగెత్తాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాలను బంద్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న మీసేవ నిర్వాహకులకు పాత పద్ధతిలోనే కమీషన్లు చెల్లిస్తుండడాన్ని నిరసిస్తూ మీసేవ కేంద్రాల నిర్వాహకులు చేపట్టిన బంద్‌తో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల ఆపరేటర్లకు ఆదాయం రాని పక్షంలో ఆపరేటర్లకు ప్రభుత్వం కనీసభృతి రూ. 15వేలు చెల్లించాలని, 2012 నుంచి అమలు చేస్తున్న రూ. 2 స్కానింగ్ చార్జీలను రూ. 5కు పెంచాలని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించిన 18 శాతం జీఎస్టీని మీసేవ కేంద్రాల నుంచి వసూలు చేస్తున్నారని, ఈ మొత్తాన్ని రద్దు చేయాలని, రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీల నిర్వాహకులకు ఒకే విధానంలో ఒకే రకమైన కమీషన్‌ను ప్రతి నెలా నిర్ధిష్టమైన తేదీన ఆపరేటర్లకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ సేవ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
యాగంటీశ్వరుని సన్నిధిలో
హైకోర్టు జడ్జి
బనగానపల్లె, జనవరి 18:మండల పరిధిలోని యాగంటి క్షేత్రాన్ని శుక్రవారం హైకోర్టు జడ్జి డీవీఎస్‌ఎస్ సోమయాజులు, ఆయన సతీమణి శర్వాణి దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్ బత్తుల బాలిరెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. జడ్జి దంపతులు తొలుత శ్రీఉమామహేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించగా వారిని చైర్మన్, అర్చకులు సత్కరించి ప్రసాదం అందజేశారు.