కర్నూల్

కలెక్టరేట్‌లో 1950 కాల్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 22:ఓటరు జాబితాలో ఓటు ఉందా లేదా అనే అంశంపై అనుమానాలు నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ రవిసుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు సమాచారం తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెం.08518-1950కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ కేంద్రంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ అన్ని పని దినాల్లో ఓటరు సమాచారాన్ని తెలిపేందుకు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కాంటాక్ట్ అధికారిగా డీఆర్వో వ్యవహరిస్తారని తెలిపారు. ఓటరు సమాచారాన్ని తెలిపే టోల్ ఫ్రీ నెంబర్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలి
* డీఆర్వో వెంకటేశం
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 22:ఈ నెల 26వ తేదీ నిర్వహించే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని డీఆర్‌ఓ వెంకటేశం జిల్లా అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించే రిపబ్లిక్ డేకు అధికారులందరూ హాజరై అప్పగించిన పనులు పూర్తి చేయాలన్నారు. విధుల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బంది జాబితాను పంపాలని సూచించారు. డీఆర్‌డీఏ, డ్వామా, హౌసింగ్, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన, తదితర కార్పొరేషన్లు, డీఎస్‌ఓ, డీటీసీ, అటవీ, పోలీసు, తదితర శాఖలు గత నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతి, తాజా సమాచారంపై శకటాల ప్రదర్శనతో పాటు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారును ఆదేశించారు.
పూజలందుకుంటున్న
అహోబిలేసుడు
ఆళ్లగడ్డ, జనవరి 22: పారువేట ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మర్రిపల్లె గ్రామం చేరుకున్న అహోబిలేసుని ఉత్సవ పల్లకికి గ్రామస్థులు పెద్ద ఎత్తున ఎదురేగి స్వాగతం పలికారు. మంగళవారం స్వామి పల్లకి గ్రామంలో పర్యటించి తెలుపులపై ఆశీనులై ప్రజలనుండి పూజలందుకున్నారు. పల్లకిలో కొలువైన శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరద స్వామిలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో తిరుణాల వాతావరణం నెలకొంది.