కర్నూల్

బీసీలు టీడీపీ వెంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 19:రాష్ట్రంలోని బీసీలంతా టీడీపీ వెంటే ఉన్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న తన ఛాంబర్‌లో మంగళవారం సోమిశెట్టి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడమే కాకుండా వారిని చిన్నచూపు చూసిందన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడే ఎక్కువ శాతం టికెట్లను బీసీలకు ఇచ్చి రాజకీయంగా ఎదిగేందుకు ప్రోత్సహించారన్నారు. దీంతో బీసీలు ఆర్థికంగా, రాజకీయం గా ఎదిగారని, ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా క్యాబినెట్‌లో కూడా కీలకమైన పదవులు ఇచ్చారన్నారు. అలాగే వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి, టీడీపీ బీసీల పార్టీ అని నిరూపించారన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా గత నెలలో జయహో బీసీ సభ నిర్వహించి బీసీ కులాలను గుర్తించి వాటికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు కూడా మంజూరు చేశారన్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ నేత జగన్ భయంతో ఏపీలో ఎవరూ సహకరించకపోవడంతో తెలంగాణ నాయకుల సహాయంతో ఏలూరులో బీసీ గర్జన సభ పెట్టారని విమర్శించారు. జగన్ బీసీల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని, కావున ప్రజలు ఓటుతో వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
శివాజీకి నివాళి
కల్లూరు, ఫిబ్రవరి 19:్ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకుని మంగళవారం కల్లూరు అర్బన్ పరిధిలోని పురుషుల డిగ్రీ కాలేజీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేత భాస్కర్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పాలనలో ధీరుడని, వాటితో పాటు రోడ్ల వెంట చెట్లు పెంచి వాతావరణ కాలుష్యాన్ని కాపాడిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
నందికొట్కూరులో..
నందికొట్కూరు : ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పట్టణంలో మంగళవారం శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు జీవన్ మాట్లాడుతూ శివాజీ 16 ఏళ్ల వయస్సులోనే కత్తి పట్టి యుద్ధం చేసిన వీరుడన్నారు. యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తులు వేసి విజయం సాధించేవాడన్నారు. తమ రాజ్యంలో ప్రజలకు కష్టాలు రాకుండా మహిళల సంక్షేమం కోసం పని చేసిన మహానుభావుడన్నారు. పరాయి స్ర్తిని తల్లిగా భావించి రాజ్యపాలన చేసిన గొప్ప వ్యక్తి శివాజీ అని, ధర్మం కోసం ప్రాణాలు లెక్కచేయని పోరాట యోధుడన్నారు. యువకులు శివాజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.