కర్నూల్

జియో కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌కు ద్రోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, ఫిబ్రవరి 19:కేంద్ర ప్రభు త్వం జియోతో లోపాయికారి ఒప్పం దం పెట్టుకుని ఏళ్ల తరబడి సేవలు అందించిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు ద్రోహం చేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు పుల్లారెడ్డి, రాజగోపాల్ ధ్వజమెత్తారు. బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్ ముందు చేపట్టిన ధర్నాకు సీఐటీయూ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకట్టించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భద్రతకు కమ్యూనికేషన్స్ చాలా కీలకమని భావించి 1991 తర్వాత ఆర్థిక సంస్కరణల పేరుతో టెలికాం రంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి టెలికాంను బీఎస్‌ఎన్‌ఎల్‌గా మార్చిందన్నారు. అప్పటికి సంస్థలో రూ. లక్షల కోట్లు అదనపు నిల్వలు ఉన్నాయని అటువంటి సంస్థను నేడు దీవాళా తీయించారని, కనీసం కార్మికులకు బోనస్ కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జియో అధినేతలతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఇకనైనా కేంద్రం స్పందించి బీఎస్‌ఎన్‌ఎల్ రంగాన్ని పటిష్ట పరిచి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులచే పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు.
పని చేసే వారిని ఎన్నుకుంటేనే అభివృద్ధి
* సీనియర్ న్యాయవాది జయరాజ్
కోడుమూరు, ఫిబ్రవరి 19:పని చేసే వారిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని సీనియర్ న్యాయవాది వై.జయరాజ్ పేర్కొన్నారు. కోడుమూరు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మంగళవా రం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పని చేసే వారినే ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. అవినీతిని ప్రోత్సహించే వారిని, ప్రజల బాగోగు లు పట్టించుకోని వారిని దూరం పెట్టాలన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. ఈ నియోజకవర్గంతో తనకు గత 20 ఏళ్ల నుంచి సత్సంబంధాలు ఉన్నాయని, ప్రతి గ్రామంతో తనకు పరిచయాలు, సమస్యలపై అవగాహన ఉందన్నారు. 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న సమస్యలు నేటికీ ఈ నియోజకవర్గంలో ఉన్నాయని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారు వాటి పరిష్కారం కోసం ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. తాగు, సాగునీరు, డిగ్రీ కళాశాల ఏర్పాటు, తదితర సమస్యలు ఇంకా ఉండటం సిగ్గుచేటన్నారు. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయమని ప్రజలు రోడ్డెక్కడం బాధాకరమన్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవాల్సిన సమస్యల పరిష్కారానికి ప్రజలు దీక్షలు చేయాల్సి రావడం విచారకరమన్నారు. తాను ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. ప్రజలకు కనీస వౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఆ బాధ్యతను తానేప్పుడూ మరువనన్నారు. ప్రస్తుతం సమస్యల పరిష్కార కోసం కోడుమూరు అభివృద్ధి కమిటీ సభ్యులు చేపట్టిన దీక్షలకు తన సంపూర్ణ మద్దుతు ఉంటుందని, వారు ఎప్పుడు పిలిచినా తోడుగా రావడానికి సిద్ధం అన్నారు.