కర్నూల్

బసాపురం పొలాల్లో చిరుత సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, ఫిబ్రవరి 19: మండల పరిధిలోని బసాపురం పంట పొలాల్లో చిరుత సంచరిస్తుండగా రైతులు భయభ్రాంతులకు గురవుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పొలాలకు కాపలా కాస్తున్నారు. ఆరుగాలం కష్టించి పంటను అడవి జంతువుల నుండి రక్షించుకొనేందుకు పంట పొలాలకు వెళ్లగా కాపలాగా వెళ్లిన రైతులుకు చిరుత కనిపించడంతో రైతులు పరుగులు పెట్టినట్లు వాపోయారు. మంగళవారం అటవీ శాఖ సిబ్బంది, రైతులు తెలిపిన వివరాల మేరకు బసాపురం సమీపంలోని పంట పొలాలకు కాపలాగా వెళ్లిన రైతుల వెంట ఉన్న కుక్క అరుపులతో చిరుతపులిని గమనించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించగా ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసరెడ్డి, రామకృష్ణలు పరిశీలించారు. రేంజ్ ఆఫీసర్ గౌడుకు సమాచారం అందించగా రైతులు పెద్దపులి అని అనుమానం వ్యక్తం చేయగా ఫారెస్టు అధికారులు పాదముద్రలను సేకరించి చిరుతపులి అని గుర్తించారు. పంట పొలాలు అడవి జంతువుల వల్ల ఏవైనా నష్టం కలిగి ఉంటే ప్రభుత్వం నుండి పరిహారం అందేలా చూస్తామన్నారు. వన్యమృగాలను దూరంగా పారద్రోలేందుకు అరుపులతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేయిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.