కర్నూల్

ఓటరుగా నమోదు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 19:18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగర శివారులోని దూపాడు వద్ద ఉన్న కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందన్నారు. ఈ వ్యవస్థలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం హక్కు కల్పించిందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అత్యంత విలువైందన్నారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి సైతం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన చరిత్ర మన దేశంలో ఉందన్నారు. దీంతో ప్రతి ఓటు ఎంతో విలువైందని, ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువలను మరింత పెంచాలన్నారు. అంతేగాక మీ చుట్టు పక్కల వారికి ఓటు విలువను తెలియజేసి ఓటును వినియోగించుకునేలా వారిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత యువతపై వుందన్నారు. ఓటు నమోదు కోసం ఫారం-6ను రెవెన్యూ అధికారుల ద్వారా పంపుతామని వెంటనే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం ఆవిర్భవించిన 1950 సంవత్సరానికి గుర్తుగా భారత ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మీ ఓటుకు సంబంధించి ఎలాంటి సందేహం వున్నా వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్స్ అనే 3 రకాల మిషన్లు వుంటాయన్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా వీవీ ప్యాట్స్‌ను వినియోగిస్తున్నామన్నారు. దీని ద్వారా మనం ఏ గుర్తుకు ఓటు వేశామో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు సీ-విజిల్ అనే కార్యక్రమం కూడా త్వరలో అమలులోకి రానుందన్నారు. దీని ద్వారా ఎలాంటి ఫిర్యాదులందినా 24 గంటల్లో పరిష్కరించేందుకు విధిగా చర్యలు తీసుకుంటామన్నారు. జేసీ రవిసుభాష్ మాట్లాడుతూ అర్హత వున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్లందరూ ఈ విషయంపై అవగాహన పెంచుకుని ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మహాకూటమికి బుద్ధి చెప్పండి
* బీజేపీ జాతీయ కార్యదర్శి ఆర్పీ సింగ్
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 19: మహాకూటమి పేరుతో దేశాన్ని దోచుకోవడానికి దొంగలు వస్తున్నారని, యువత ఏకమై తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి ఆర్పీ సింగ్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కేవీ.సుబ్బారెడ్డి మహిళా కళాశాలలో ప్రజా చైతన్య సదస్సు నిర్వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యదర్శి ఆర్పీ సింగ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షులు రమేష్ నాయుడు, సునీల్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, బీజేపీ జిల్లా కన్వీనర్ నరసింగరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్పీ సింగ్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ పేరు ప్రతిష్టలను విదేశాల్లో మార్మోగేలా చేశారన్నారు. అలాంటి ప్రధాని మోదీకి తమ మొదటి ఓటు వేయాలని కోరారు. కూటమి పేరుతో ప్రతిపక్ష పార్టీలు ఏకమై మోదీని ఓడించడానికి కుట్ర చేస్తున్నాయని, వారికి వచ్చే ఎన్నికల్లో యువత ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టి మరోసారి మోదీ ప్రధాని అవుతారన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు మాట్లాడుతూ మొదటిసారిగా ఓటరుగా నమోదు చేసుకున్న యువత దేశం కోసం శ్రమిస్తున్న ప్రధాని మోదీకి తమ మొదటి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఏమైనా చేయండి మీ వెంటే మేము ఉంటామని సైనికులకు ధైర్యం చెప్పిన ఒకే ఒక్క నాయకుడు మన ప్రధాని మోదీ అన్నారు. యువతీ, యువకులకు ఉద్యోగాల్లో ఎన్నో అవకాశాలు ఇస్తు స్వతహాగా తమ ఆలోచనలతో సొంతంగా ఎదగడానికి ముద్ర ద్వారా అవకాశం కల్పించారన్నారు.