కర్నూల్

అంధత్వ నివారణే ‘లక్ష’్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 23:సమాజంలో అంధత్వ నివారణ, ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకునే క్రమం లో జిల్లా వ్యాప్తంగా నేత్రదానం చేసేందుకు లక్ష సంతకాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. నేత్రదాన అంగీకార పత్రాల పై సంతకం చేసేందుకు వెయ్యి మంది రౌడీ, హిస్టరీ షీటర్లు మందుకు రావ డం శుభపరిణామమన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం ‘నేత్రదానం చేయండి’ అని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంధత్వ నివారణ కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా నేత్రదానం చేయాలన్నారు. ఈ సందర్భం గా వెయ్యి మంది రౌడీ, హిస్టరీ షీటర్లు స్వచ్ఛందంగా ముందుకువచ్చి నేత్రదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేసి సమ్మతి పత్రాలపై సంతకాలు చేశారన్నారు. మంచి ఆశయంతో చేపట్టిన లక్ష మంది నేత్రదానం లక్ష్యాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. 6 సబ్ డివిజన్లలో ఈ రోజు నుంచే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్ నేత్రదానంపై ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ను ఎస్పీ ప్రారంభించారు. అలాగే నేత్రదానం లక్ష్యానికి కృషి చేస్తున్న డీస్పీలు, సిఐలు, ఎస్‌ఐలను అభినందించారు. మనిషి సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు మరణించినా శరీరం బుగ్గిపాలు కావాల్సిందేనని కా నీ ప్రాణం విడిచిన దేహంలో ముఖ్యమైన అవయవాలకు మాత్రం చావులేదని ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో ఏఆర్ ఎఎస్పీ రాధాకృష్ణ, ఓఎస్‌పి రవిప్రకాష్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, డిసిఆర్‌బి డీఎస్పీ బాబుప్రసాద్, సిఐలు ములకన్న, మహేశ్వరరెడ్డి, నాగరాజుయాదవ్, కృష్ణయ్య, మధుసూదన్‌రావు, నాగరాజారావు, డేగల ప్రభాకర్ పాల్గొన్నారు.