కర్నూల్

శ్రీమఠంలో ఘనంగా అమావాస్య పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూలై 4: పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో సోమవారం అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఉంచి మఠం ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు. భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పాత ఊరులో శ్రీ రాఘవేంద్రస్వామి ప్రతిష్ఠించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కర్నాటకలో వెలిసిన శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకుని, బిచ్చాలిలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి శిశ్యుడు శ్రీ అప్పన్నాచార్యులు బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీ ప్రహ్లాదరాయలకు నిర్వహించే గజవాహనం, వెండి, బంగారు రథోత్సంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.