కర్నూల్

పుష్కరాల పనుల్లో రాజీ ప్రసక్తేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాములపాడు, జూలై 4:పుష్కరాల పను ల్లో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, 24 గంటల పాటు పనులు చేయటానికి ఆల యం వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. కపిలేశ్వరం వద్ద అటవీ శాఖ నిలిపివేసిన పుష్కరాల రోడ్డు పనులకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ విషయంపై కలెక్టర్ విజయమోహన్ సోమవారం ఆత్మకూరు డిఎఫ్‌ఓ సెల్వంతో చర్చించి కొత్త తారు రోడ్డు నిర్మాణానికి అక్కడికక్కడే డిఎల్‌ఓను ఒప్పించారు. దీంతో 15 మీటర్ల వెడల్పున రోడ్డు నిర్మాణానికి అడ్డంకి తొలగింది. ఇదిలా ఉండగా పుష్కర పనులను వేగవంతం చేసి నత్తనడకన జరుగుతున్నాయన్న అపోహను తొలగించామని ఇక నుంచి పనులు ఎలా ఉంటాయో మీరే చూస్తారుగా అని కలెక్టర్ మీడియాతో అన్నారు. కొత్త పుష్కర ఘాట్ల నిర్మాణంలో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించారు. 5 కి.మీ పొడవున 275 విద్యుత్ స్తంభాలకు లెడ్ లైట్లు, 6 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుకు సిద్ధమంగా ఉన్నామని విద్యుత్ శాఖ ఎస్‌ఇ భార్గవ రాముడు తెలిపారు. ఆర్టీసీ పార్కింగ్‌కు రెండెకరాల అటవీ మైదానాన్ని ఎంపిక చేశామని, మినీ బస్సుల ద్వారా ఘాట్ల వద్దకు భక్తులను చేర్చుతామని ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరావు తెలిపారు. ఆర్‌అండ్‌బి పనులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గాయిత్రీదేవి ఆలయ మరమ్మతులపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ సంగమేశ్వరంలో కృష్ణ పుష్కరాలను ప్రతిష్కాత్మకంగా నిర్వహించేలా అధికారుల చేత పని చేయిస్తున్నాన్నారు. కాగా గత 3 రోజుల్లోనే కలెక్టర్ రెండవ సారి సప్తనది సంగమేశ్వరంలో జరుగుతున్న పుష్కర పనులను తనిఖీ చేశారు. కలెక్టర్ పర్యటన గోప్యంగా ఉంచడంతో చివరి క్షణంలో అధికారులు ఆగమేఘాల మీద కృష్ణానది ప్రాంతానికి చేరుకున్నారు. కలెక్టర్ వెంట సిఇ చిట్టిబాబు, ఎస్‌ఇ చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.