కర్నూల్

అమరావతిలో ఐటి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూలై 4:ఐటి కంపెనీలు అమరావతిలో ఏర్పాటు చేస్తూ, విషపూరిత వాయువులు వెదజల్లే పరిశ్రమలను రాయలసీమలో ఏర్పాటు చేయటం ఏంటని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిఎం చంద్రబాబును ప్రశ్నించారు. పాణ్యం మండలంలో ఏర్పాటు చేయనున్న నానో కెమికల్ పరిశ్రమ అనుమతిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆ మండల పరిధిలోని కొండజూటూరు, బలపనూరు గ్రామాల ప్రజలు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన బైరెడ్డి మాట్లాడుతూ నానో కెమికల్ పరిశ్రమ ఏర్పాటుకు కొండజటూరు వద్ద దాదాపు 150 ఎకరాల భూమిని కేటాయించారని, అయితే ఆ పరిశ్రమ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవని మండిపడ్డారు. విషపూరితమైన వాయువులు వెదజల్లే పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయన్నారు. ముఖ్యంగా ఈ పరిశ్రమకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి లేదన్నారు. దీనికి తోడు నానో కెమికల్ ప్రెస్పిటేడ్ కాల్షియం కార్బొనేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం ఆయా గ్రామాల్లో ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారని ధ్వజమెత్తారు. సిఎం చంద్రబాబు కూడా రాజధాని అమరాతిలో ఐటి కంపెనీల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ, సీమలో మాత్రం కాలుష్యం వెదజల్లే పరిశ్రల ఏర్పాటుకు అనుమతి ఇవ్వటం ఏంటని, ఆయన దృష్టిలో సీమ ప్రజలు మనుషులు కారా అని ప్రశ్నించారు. పర్యావరణానికి హాని కలుగకుండా, సమాజ భద్రతకు ప్రమాదకరంగా లేని, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నానో కెమికల్ పరిశ్రమకు కేటాయించిన స్థలంలో ఆయా గ్రామాల ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించి వేసవిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ధర్నాలో ఆర్పీఎస్ నాయకుడు శ్రీ్ధర్, విద్యార్థి సంఘం నేత ఓబులేసు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.