కర్నూల్

16న సిఎం చంద్రబాబు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 4:ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 16వ తేదీ శ్రీశైలం వస్తున్న సందర్భంగా పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆకే రవికృష్ణ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. పుష్కరాల బందోబస్తు శిక్షణలో భాగంగా నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో 4వ బ్యాచ్ పోలీసులకు తరగతులు నిర్వహించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఇన్‌స్పెక్టర్ జానకీరామ్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, అప్రమత్తంగా ఉండాలన్నారు. పుష్కరాల్లో ముఖ్యమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీశైలంలో విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్ల చర్యలు చేపట్టాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు పుకార్లను, వదంతులను నమ్మవద్దని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పోలీసు సిబ్బంది ఉండాలన్నారు. పుకార్ల వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. భక్తులు పుష్కర ఘాట్లకు చేరుకునేందుకు రూట్‌మ్యాప్ తెలిసే విధంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాలకు లక్షల మంది ప్రజలు వస్తుంటారని పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ రాధాకృష్ణ, ఆర్‌ఐ రంగముని, పాల్గొన్నారు.