కర్నూల్

ఎమ్మెల్యే భూమాకు నాన్ బెయిలబుల్ వారెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 4 : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై సోమవారం జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ రామ్మోహన్‌రావు నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేశారు. భూమా నాగిరెడ్డి సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా గౌర్హాజరు కావడంతో ఫస్టుక్లాస్ మెజస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసినట్లు నంద్యాల త్రీటౌన్ ఎస్‌ఐ సౌర్యవౌలి తెలిపారు. 2015 మార్చి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తున్నారన్న విషయమై, విధి నిర్వహణలో ఉన్న డీఎస్పీ దేవదానంపై భూమా నాగిరెడ్డి కులం పేరుతో దూషించారని, డీఎస్పీ చేసిన ఫిర్యాదు మేరకు నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో భూమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఇతర సెక్షన్ల కింద నమోదు చేసిన కేసు సంబంధించి సోమవారం భూమా నాగిరెడ్డి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. భూమా నాగిరెడ్డి ఆదివారం రాత్రి స్వల్ప అస్వస్తతకు గురికావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరి గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు తెలిసింది.