కర్నూల్

ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, జూలై 17:అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగి నష్టపోయిన బాధితులను, ప్రజలను ఆదుకోవడంలో సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫ లం చెందిందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఎమ్మెల్యే స్వగృహం వద్ద గత నెలలో ఇఏస్‌ఐ ఆసుపత్రి వద్ద గడ్డివాములు కాలిపోయిన బాధితులకు వైకాపా నాయకులు కృష్ణమోహన్ తన వంతు గా రూ. 10 వేలు ఆర్థిక సహాయం బాధితులు కురువ సోమన్నకు ఎమ్మె ల్యే సాయిప్రసాద్‌రెడ్డి ద్వారా అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ శివారులోని ఇఎస్‌ఐ ఆసుపత్రి వద్ద రెండు సార్లు అగ్ని ప్రమాదం జరిగి సుమారు 15గడ్డి వాములు దగ్ధమై అనేక మంది రైతులు లక్షలాది రూపాయాలు నష్టపోయారని అన్నారు. అలాగే మూగజీవాలకు పశుగ్రాసం లేకుండా పోయిందని కనీసం ప్రభుత్వం ఆర్థిక సహా యం అందించకపోతే పశుగ్రాసం కూడా అందించలేదని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇదే విధంగా ఆన్ని ప్రాంతాల్లోను ప్రమాదాల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ఎలాంటి చర్య లు తీసుకోవడం లేదన్నారు. ప్రమాదాలు జరిగే నష్టపోయిన సమయంలో ప్రభుత్వం యుద్ద ప్రాతిపధికన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వైకాపా పట్టణ కన్వీనర్ చంద్రకాంత్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త రవిరెడ్డి, వైకపా 13వ వార్డు ఇన్‌ఛార్జి కృష్ణమోహన్, నాయకులు సాయిరామ్, రఘు, శేఖన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.