కర్నూల్

సిఎం పర్యటనకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కర్నూలు రేంజ్ డిఐజి రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ ఆదివారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అందులో భాగంగా సిఎం పర్యటించే కర్నూలు, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో జిల్లాలోని శ్రీశైలంలో స్నానపు ఘాట్లు, తదితర ప్రాంతాలను పరిశీలించడానికి సిఎం పర్యటిస్తున్న సందర్భంగా బందోబస్తు పర్యవేక్షణ బాధ్యతలను అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, ఓఎస్‌డి రవిప్రకాష్‌లకు అప్పిగించారు. బందోబస్తు విధులకు 15మంది డీఎస్పీలు, 34 మంది సిఐలు, 106మంది ఎస్‌ఐలు, 236 ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 793 మంది కానిస్టేబుళ్లు, 48 మంది మహిళా పోలీసులు, 408 మంది హోంగార్డులు, 11 ప్లాటూన్ల ఏఆర్ బలగాలు, 4 స్పెషల్ పార్టీ బృందాలను కేటాయించారు. అలాగే పోలీసు జాగిలాలు, బాంబుస్కాడ్స్ బృందాలతో సిఎం పర్యటన ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలో పలు చోట్ల పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక మఫ్టీ పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సిఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.