కర్నూల్

పుష్కరాలపై కర్నూలులో నేడు సిఎం చంద్రబాబు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 17 : కృష్ణా పుష్కరాల పనులు జరగుతున్న తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం కర్నూలులో సమీక్షిస్తారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉదయం 11గంటలకు కర్నూలు చేరుకుని కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో శ్రీశైలం, సంగమేశ్వరంలలో పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు సమీక్షా సమావేశం ఉంటుందని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. భోజన అనంతరం కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. పనుల నాణ్యత, గడువులోగా పూర్తవుతాయా లేదా అనే విషయాలను ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలిస్తారు. అనంతరం ఆయన శ్రీశైలం నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు వెల్లడించారు.