కర్నూల్

తాగునీరు డ్రైనేజీ పాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జూలై 17:తుంగభద్ర డ్యాం నుండి తుంగభద్ర దిగువ కాలువకు నీటిని విడుదల చేయలేదు. బసాపురం ట్యాంకులో నీరు ఖాళీ అవుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నీటి ఎద్దడిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదు రోజులకు ఒక్కసారి తాగునీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. బసాపురం వద్ద ట్యాంకులో నీరు అడుగంటిపోవటాన్ని చూసిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అధికారుల తీరుపైన తీవ్రస్థాయిలో మండి పడ్డాడు. ఇలాంటి సమయంలో ప్రతి నీటి చుక్కను ఆదా చేసుకుని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాని ఆదోని మున్సిపల్ అధికారులకు నీరు వృథా అవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పాలక మండలి కూడా పూర్తి నిర్లక్ష్యం చేస్తుంది. అధికారులు, కౌన్సిల్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. అందువల్ల తాగునీరు బూస్టర్ పంపుల వద్దనే వృథాగా కాలువ పాలవుతున్నాయి. అయినా మరమ్మతులు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీటి వృధా చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహా అధికారులు కూడా సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. గోడల మీద రాతలు రాస్తున్నారు. కాని ఆదోని పట్టణంలో ప్రతి రోజు వేల గ్యాలన్లనీరు వృథా అవుతూ మురికి కాలువల్లో కలుస్తున్నాయి. ప్రతి పంప్‌హౌస్ వద్ద ఇదే పరిస్థితి ఉంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కాని పట్టణంలో ప్రజలకు గత 20 సంవత్సరాల నుంచి రెండు రోజుల ఒక్కసారి, వేసవిలో మూడు రోజులకు ఒక్కసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటి కూడా పట్టణంలోని అనేక ప్రాంతాలకు తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పట్టణంలోని శివారు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన నీటి కటకటను ఎదుర్కొంటున్నారు. కాని అధికారుల నిర్లక్ష్యం వల్ల పంపుల లీకేజి,ట్యాంకుల లీకేజీల వల్ల రోజూ వేల గ్యాలన్ల నీరు వృథాగా మురికి కాలువల్లో పోతున్నాయి. అధికారులకు, సిబ్బందికి తెలిసిన లీకేజీలను అరికట్టలేకపోతున్నారు. ఆదోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న పంప్‌హౌస్ వద్ద గత 15 సంవత్సరాల నుంచి ట్యాంకు లీకేజీ వల్ల నీరు వృథాగా మురికి కాలువల పాలవుతున్నాయి. పంప్‌హౌస్ వద్ద ట్యాంకు లీకేజి మరమ్మతులు చేయాలని అధికారుల దృష్టికి వచ్చిన అసలు పట్టించుకోవడం లేదు. వైఎంకే హైస్కూల్ ట్యాంకు వద్ద, హనుమాన్ నగర్ ట్యాంకు వద్ద, మున్సిపాలిటీ సమీపంలో ఉన్న పంప్‌హౌస్ వద్ద పంపుల లీకేజీ వల్ల నీరు వృథాగా కాలువల్లో కలుస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో తాగునీరు మురికి గుంతలుగా దర్శనమిస్తున్నాయి. ఇలా అనేక ప్రాంతాల్లో లీకేజీల వల్ల తాగునీరు వృథాగా మురికి కాలువల పాలవుతున్నాయి. ఆదోని మున్సిపాలిటి ప్రథమశ్రేణి మున్సిపాలిటి కావడం వల్ల డిఇ, ఇఇ స్థాయి అధికారులు తాగునీటి సరఫరాకు బాధ్యులుగా ఉన్నారు. అయినప్పటికి లీకేజీలతో తాగునీరు వృథా అవుతున్న అధికారులు వార్డుల వారిగా పర్యవేక్షణ చేయడం లేదు. పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. అడిగే నాథుడేలేడు. అందువల్ల పైపులు లీకేజీ కావడం, పంప్‌హౌస్ వద్ద ట్యాంకులు లీకేజీ అవుతున్న అధికార యంత్రాగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. మరో వైపు చూస్తే తాగునీటి కట కటతోప్రజలు రెండు రోజులకు ఒక్కసారి నీటిని తాగే పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే తాగునీరు మురికి నీటిపాలవుతున్నాయి. ఇక మోటర్లు రిపేర్ల పేరుతో తాగునీరు సక్రమంగా సరఫరా చేయని పరిస్థితి ఉంది. దీనిపై కూడా అధికారులు చర్యలు తీసుకోక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు తాగునీటిని వృధా కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లీకేజీలు చివరకు బురద గుంతలుగా మారుతున్నాయి. అయినప్పటికి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వల్ల తాగునీరు వృధాగా మురికి కాలువల పాలువుతున్నాయి. ప్రజలు తాగునీటి కటకటతోవిలవిలలాడుతున్నారు. రెండు రోజులకు ఒక్కసారి తాగునీటిని సరఫరా చేస్తున్న అధికారులు తాగునీటి పన్ను మాత్రం చెల్లించకపోతే నీటి పంపుల కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరికలు చేస్తూ, ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కాని సక్రమంగా ప్రజలకు నీటిని సరఫరా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారు. చివరకు లీకేజీలను కూడా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. విలువైన తాగునీరు అధికారుల కళ్ళ ముందే మురికి కాలువల పాలవుతున్నాయి. చివరకు తాగునీటిలో కలిపే ఆలం కూడా సక్రమంగా కలపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంపుల లీకేజీల వల్ల తాగునీరు మురికి కాలువ నీటితో కలిసి ప్రజలను రోగాల బారిన పడే పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. కావున మున్సిపల్ చైర్మన్, కమిషనర్, అధికారులు వెంటనే లీకేజీలను అరికట్టి మురికి కాలువల పాలు కాకుండా తాగునీటిని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.