కర్నూల్

అత్తింటి ఆరళ్లకు అబల బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవెలకుంట్ల, జూలై 19:అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం కోవెలకుంట్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మంజునాథ్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని అమడాల గ్రామానికి చెందిన శివకుమార్, రాజేశ్వరి దంపతుల కుమారుడు లక్ష్మినారాయణకు, బనగానపల్లె మండలం ఇల్లూరుకొత్తపేట గ్రామానికి చెందిన నాగేశ్వరయ్య కుమార్తె లక్ష్మిసుజాత(25)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పట్టణంలోని అభిరుచి హోటల్ సమీపంలో అద్దె ఇంటిలో నివాసం వుంటున్నారు. లక్ష్మినారాయణ చెక్క పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే గత కొంతకాలంగా అత్త, మామ, భర్త అదనపు కట్నం తీసుకురావాలని లక్ష్మిసుజాతను వేధింపులకు గురి చేస్తుండేవారు. మంగళవారం కూడా అదనపు కట్నం కోసం తీవ్రంగా వత్తిడి చేయడంతో మనస్థాపానికి గురైన లక్ష్మిసుజాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె తండ్రి నాగేశ్వరయ్య ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.