కర్నూల్

తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 19:కల్లూరు మండల పరిధిలోని ఎర్రకత్వ గ్రామంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పదస్థితిలో మృతిచెందగా మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎర్రకత్వ గ్రామంలో ఓ పాడుబడిన బావి పక్కన శిథిలమైన చిన్న గదిలో మద్దమ్మ(35), ఆమె కూతురు లక్ష్మీ(8) మృతదేహాలు పడి ఉండగా గూడూరు గ్రామానికి చెందిన వ్యక్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఆకే రవికృష్ణ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, కల్లూరు తహశీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఫొరెన్సిక్ నిపుణులు డా శంకర్‌నాయక్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అలాగే డాక్టర్ శంకర్‌నాయక్ అక్కడే మృతదేహాలకు శవపంచనామా నిర్వహించారు. తల్లీకూతూళ్ల హత్యలపై దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ డీఎస్పీ, సిఐలను ఆదేశించారు. అనంతరం గ్రామస్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. గ్రామప్రజలు పోలీసులకు సహకరించి నిందితుల సమాచారం అందజేయాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కేసు విచారణ, దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన నిందితులను అరెస్టు చేసి, కఠిన శిక్షలు పడేలా చేయాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీతో పాటు సిఐ నాగరాజుయాదవ్, ఓర్వకల్లు, గూడూరు, నాగాపురం, వెల్దుర్తి స్టేషన్ల ఎస్‌ఐలు చంద్రబాబునాయుడు, చంద్రబాబు, మోహన్‌కిషోర్‌రెడ్డి, నాగతులసీప్రసాద్, ప్రొహిబిషనరీ ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ఉన్నారు.