కర్నూల్

శాకాంబరిగా దర్శనమిచ్చిన అంకాలమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, జూలై 19: మండలంలోని తిమ్మాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి అలంకారం చేసి భక్తులకు కనువిందు కలిగేలా అలంకరించారు. ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మరచిన వ్యాసపౌర్ణిమ వేడుకలు
దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న శైవక్షేత్రాల్లో ఒకటైన మహానంది పుణ్యక్షేత్రంలో వ్యాస (గురు) పూర్ణిమ విడుకలను అధికారులు, అర్చకులు మరచారు. దేశంలోనే ప్రతి దేవాలయంలో ఈ వ్యాస పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తుండగా, మహానందిలో కనీసం స్వామి, అమ్మవార్లకు కూడా ప్రత్యేక అలంకారం లేకపోవడంతో భక్తులు నిరుత్సాహంతో దర్శించుకొని వెళ్లారు. పౌర్ణమి వేడుకల సందర్బంగా మహానందిలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారికి సాధారణ పూలమాలలు వేసి భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామాల్లో వెలసిన చిన్న చిన్న గ్రామ దేవతలకు సైతం ప్రత్యేకంగా అలంకరించుకొని పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో శాకాంబరిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీశైలం తరువాత అంతటి పేరు గాంచిన మహానందిలో ఈ పౌర్ణమి వేడుకలు జరుపకపోవడంతో భక్తులు పలు విధాలుగా విమర్శిస్తున్నారు. పీఠాధిపతులు, స్వామీజీలు ఈ చాతుర్మాస దీక్షలను తీసుకుంటూ ఈ వేడుకలను జరుపుకుంటారు. అలాంటిది మహానందిలో లేకపోవడంతో భక్తులు విమర్శిస్తున్నారు.