కర్నూల్

ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, జూలై 19: స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మంచిగా మాట్లాడి, వారి సమస్యను పరిష్కరించాలని డిఐజి రమణకుమార్ పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. డిఐజి మంగళవారం పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్‌ను సందర్శిం చారు. తొలుత డిఐజికి డీఎస్పీ హరినాథరెడ్డి, సిఐ మురళీధర్‌రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం డిఐజి నంద్యాల మండలంలో ఉన్న 18 మండలాల చిత్రపటాన్ని పరిశీలించారు. అలాగే కేసులు, మండలంలోని సమస్యలపై సిఐని, ఎస్‌ఐ గోపాల్‌రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఐజి విలేఖరులతో మాట్లాడుతూ మండలంలోని 18 గ్రామాల్లో 132 ప్రమాదాలు జరిగాయని, ఆయా ప్రమాదంలో మొత్తం 31మంది చనిపోయారన్నారు. ఇక కుటుంబ కలహాలతో భార్యాభర్తలు పోలీస్ స్టేషన్‌కు వస్తే వెంటనే సమస్యను పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. డిఐజి సిఐలు మురళీధర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.