కర్నూల్

సాంస్కృతిక వారసత్వాన్ని మరవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, జూలై 19: భారతీయులు సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుంచుకోవాలని, పాశ్చాత్య విధానాన్ని విడనాడి మన సంప్రదాయాలను పాటించాలని శ్రీశ్రీశ్రీ అచల పరిపూర్ణ యోగానంద(పాములేటి) స్వామి పిలుపునిచ్చారు. మంగళవారం వ్యాసపూర్ణిమను పురస్కరించుకుని ఎన్‌జిఓ కాలనీలో వెలసిన అమరయోగాశ్రమ ఆవరణంలో యజ్ఞాలను నిర్వహించారు. 108 యజ్ఞ యజ్ఞ వేదికలను ఏర్పాటు చేసి హోమాన్ని పాల్గొన్న భక్తులచేత చేయించారు. ముందుగా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన వేదవ్యాసుడికి పూజలు చేశారు. ఈసందర్భంగా యజ్ఞంలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారన్నారు. ప్రతి వ్యక్తికి తొలి గురువు తల్లిదండ్రులని, పాఠశాలలో చదువు చెప్పినవారు తరువాత గురువులని, మనకు కుల గురువులు ప్రత్యేకంగా ఉంటారని తెలిపారు. ఆషాడ పూర్ణిమ రోజు ఎవరికి వారు తమతమ గురువులు పూజించుకొనే సాంప్రదాయం ఆనాదిగా వస్తుందన్నారు. భారతదేశం కొన్నివేల సంవత్సరాల క్రితమే విశ్వగురువుగా ఉందని, ఆషాడ పౌర్ణమి పేరు చెప్పుగానే సాంస్కృతి నేపథ్యంలో గురుపూర్ణిమ అంటారని, చీకటిని పారద్రోలే వాడు గురువని, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు అన్నారు. వ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించాడని, భగవద్గీత, శివ సహస్ర నామాలు, విష్ణు సహస్ర నామాలు, లలితా సహస్ర నామాలు ఇవన్నీ వ్యాసుడు అందించాడని, అందువల్లనే గురుపూర్ణిమను మనం వ్యాస పూర్ణిమ అనే పేరుతో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని తెలిపారు. గురువును ఆరాధించే వారు అనేక మంచి గుణాలు కలిగి ఉంటారని, సద్గురువులు దొరకడం చాలా దుర్లభమని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గురువును ఎంచుకొని తమ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలన్నారు. నిరంతరం సంచారం చేసే గురువులు, పీఠాధిపతులు ఆషాఢ పూర్ణిమ నుంచి గురువులు, పీఠాధిపతులు తమ సంచారం ఆపి చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి గురువు తప్పనిసరి అన్నారు. భక్తి నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు. గురుశిష్యుల బంధం ఎంతో పవిత్రమైనదని, శిష్యులు గురుమార్గంలో పయనిస్తే జ్ఞానాన్ని సముపార్జించి ఉన్నత స్థానాన్ని పొందుతారన్నారు. ఆధ్యాత్మిక భావనలో శ్రీకృష్ణుడు, వేద వ్యాసుడు జగదుర్గరువులుగా పేరు పొందారన్నారు. అఖిల జగత్తుకు గురువు శ్రీకృష్ణపరమాత్మ అని అర్జునిని శిష్యునిగా స్వీకరించి భగవద్గీతను ప్రబోధించడం వల్లనే ఈరోజు మనకు గొప్ప ఆధ్యాత్మిక గ్రంధమైన భగవద్గీత లభించిందన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు.