కర్నూల్

పుష్కరాల విధులు సమర్థవంతంగా నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 19: త్వరలో జరగబోయే కృష్ణా పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా శ్రీశైలం, సంగమేశ్వరం క్షేత్రాల్లో 24 గంటల పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులు ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం పుష్కర విధుల నిర్వహణపై ఎస్పీ ఆకే.రవికృష్ణ, జాయింట్ కలెక్టర్లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా అన్ని శాఖలు తమ సిబ్బంది చేత 24 గంటల పాటు విధులు నిర్వహించేలా పక్కాప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఇందులో భాగంగా కోర్ డిపార్టుమెంట్లకు సంబంధించి హెచ్‌ఓడి, ఇన్‌చార్జి అధికారులు 24 గంటల పా టు ఆగస్టు 8 నుంచి 24వ తేదీ వరకూ విధులు నిర్వహించాలన్నారు. కింది స్థాయి సిబ్బంది ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ, 2 నుంచి రాత్రి 9గంటల వరకూ, రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 7 వరకూ ప్రకారం 3 షిఫ్టులలో విధులు నిర్వహించేలా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది జాబితా తయారు చేసి ఈ నెల 21వ తేదీలోగా తమకు అందజేయాలన్నారు. సిబ్బంది నిర్వహించే విధులు, స్మూక్షస్థాయి ప్రణాళికతో వివరాలు అందిస్తే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు వసతి, భోజన సౌకర్యాలను కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి పరికరాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ఇరిగేషన్ ఎస్‌ఇ చంద్రశేఖర్‌రావు, జెడ్పీ సిఇఓ ఈశ్వర్, ఆర్డీఓ రఘుబాబు, డీఎస్పీలు, అన్ని ప్రధాన శాఖల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.