కర్నూల్

వినియోగదారుడి ఇంటికే కూరగాయలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 19: వినియోగదారులకు వచ్చే ఖరీఫ్ నాటికి నేరుగా రైతుల పొలాల వద్ద నుంచి కూరగాయలు అందేలా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశామని, మంచి నాణ్యమైన కూరగాయలు అందేలా చేస్తామని రాష్ట్ర మార్కెట్ శాఖ సిఇఓ రమణమూర్తి అన్నారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని మార్కెట్‌యార్డును చైర్మన్ సిద్ధం శివరామ్‌తో కలిసి మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను పరిశీలించి వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎపిలోని 13 జిల్లాల్లో వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలతో పాటు అతి తక్కువ ధరలకు అందేలా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ముందుగా అమరావతిలో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. రసాయనిక ఎరువులతో పండించిన కూరగాయలను వినియోగదారులు ఇష్టపడడం లేదన్నారు. ఎంత ధర అయినా నాణ్యమైన కూరగాయలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారన్నారు. అందుకే సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామన్నారు. రైతుబజార్‌లలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవడానికి మార్కెట్ యార్డు చైర్మన్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలోనే భారతదేశం కూరగాయల పంటలలో ముందంజలో ఉందన్నారు. రైతులకు ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తామన్నారు. ఆయన వెంట మార్కెట్ యార్డు చైర్మన్ సిద్ధం శివరాం, సిబ్బంది ఉన్నారు.