కర్నూల్

సంగమేశ్వరానికి పూర్వవైభవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 19 : సప్తనదీ సంగమేశ్వరం ఆలయానికి పూర్వవైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పలు ప్రముఖ ఆలయాలకు నిలయమైన జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. తాజాగా ఆగస్టులో నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల ప్రారంభ వేడుకలను సైతం సంగమేశ్వరంలో నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నారని, ఇక్కడే సిఎం చంద్రబాబు కుటుంబంతో పాటు పుష్కర స్నానం చేస్తారని జిల్లా అధికారులకు సూచనప్రాయంగా తెలిసింది. సప్తనదుల సంగమ స్థలి కావడం, పురాతన ఆలయం అందులో ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపదారు శివలింగం, భీముడు తీసుకువచ్చిన భీమ లింగం ఉండటమే కాకుండా కృష్ణానది రాష్ట్రంలో అడుగుపెట్టే ప్రాంతం కావడంతో సంగమేశ్వరంలో ప్రారంభ వేడుకలు నిర్వహించాలన్న ఆలోచనకు దారి తీసిందని చర్చించుకుంటున్నారు. అంతేగాకుండా దిగువన విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో గోదావరి జలాల సంగమ ప్రాంతంలో పుష్కరాల ప్రారంభ వేడుకల నిర్వహణ, పుష్కర స్నానాలపై పలువురు పీఠాధిపతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీంతో విజయవాడ వద్ద పుష్కరాల ప్రారంభంపై చర్చకు దారి తీసింది. సంగమేశ్వరంలో పుష్కర ప్రారంభ వేడుకలు నిర్వహించడానికి రద్దీ ఉండదన్న ప్రధానంగా ఆలోచన చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో చోటు చేసుకున్న విషాద సంఘటనలకు ఆస్కారం లేకుండా చేయాలంటే విజయవాడ, శ్రీశైలం కంటే సంగమేశ్వరం మంచిదని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
సంగమేశ్వరంలో పుష్కర ప్రారంభ వేడుకల నిర్వహణకు కారణాలు ఏవైనా ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానమాచరిస్తే సప్తనదీ సంగమేశ్వరానికి జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంగమేశ్వరం సమీపంలో దేశంలోనే మూడవదైన సరస్వతీ క్షేత్రం కొలనుభారతి ఉండటంతో ఆ ఆలయానికి కూడా గుర్తింపు రావడం ఖాయమని పేర్కొంటున్నారు. సిఎం చంద్రబాబు వస్తే సంగమేశ్వరం వరకూ ఇప్పుడు ఉన్న మార్గాలు మరింత అభివృద్ధి చెంది రాకపోకలకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోతాయని భావిస్తున్నారు. కాగా సంగమేశ్వరం వద్ద రెవెన్యూ శాఖకు చెందిన 2 వేల ఎకరాల భూమి ఉందని, అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న కలెక్టర్ విజయమోహన్ ప్రణాళికకు కూడా మంచి ఊతమిచ్చినట్లవుతుందని కలెక్టరేట్ అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా సంగమేశ్వరం ఆలయానికి జాతీయ గుర్తింపువస్తే వెనుకబడిన ఆత్మకూరు ప్రాంతం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంగమేశ్వరంలో చంద్రబాబు ఒక్కరే కాకుండా ప్రముఖులందరూ ఎక్కడ పుష్కర స్నానమాచరించినా సంగమేశ్వరం కూడా వస్తే మరింత బాగుంటుందని వారు కోరుకుంటున్నారు.