కర్నూల్

ఆక్రమణలో రైల్వే స్థలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 4: నంద్యాల పట్టణ శివారులో కుందూనది ఒడ్డున రైల్వే శాఖకు చెందిన 22 ఎకరాల రైల్వే స్థలం కబ్జాదారుల చేతిలో ఆక్రమణకు గురైనా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. రైల్వే స్థలంలో బడా బాబులు తిష్టవేసి దర్జాగా వరి సాగు చేసుకుంటున్నారు. ఈ స్థలానికి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికి గుంటూరు డివిజన్ రైల్వే అధికారులు ఎన్ని సార్లు వారికి ప్రజల నుండి వినతులు అందినా స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే స్థలాన్ని పేద, మధ్యతరగతి ప్రజలు సాగుచేసుకోవడం లేదు. సంవత్సరమంతా కుందూనది ద్వారా నీరందే ఈ పొలంలో ఏడాదికి మూడు పంటలు పండుతాయి. దీంతో బడా బాబులు కొంత మంది ఈ స్థలం తమదేనంటూ దర్జాగా కబ్జాచేసి కౌలుకు ఇచ్చి మరీ వసూలు చేసుకుంటుండడం విశేషం. రైల్వే స్థలం కబ్జాకు గురైన విషయం స్థానిక రైల్వే అధికారులకు తెలిసినప్పటికి కబ్జాదారులతో మిలాఖతై గుట్టు చప్పుడు కాకుండ వారి వద్ద నుండి కౌలురూపంలో కొంత వసూలు చేసుకొని చేతులు దులుపుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆంధ్రభూమి దినపత్రిక 2015 జూన్ 13వ తేదీ ప్రచురించిన భూ బకాసురులు2 అనే శీర్షిక కింద వచ్చిన వార్తకు గుంటూరు డివిజన్ అధికారులు స్పందించి వెంటనే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రైల్వే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థలాన్ని స్వాధీనం చేసుకొనేందుకు డివిజన్ స్థాయి అధికారులు నంద్యాలకు చేరుకొని 22 ఎకరాల రైల్వే స్థలాన్ని గుర్తించి పెగ్‌మార్కింగ్ పూర్తి చేశారు. అనంతరం ఈ స్థలం చుట్టు ముళ్లకంచె వేసేందుకు టెండరు పిలిచి గుత్తేదారునికి పనులు అప్పజెప్పారు. అయితే గుత్తేదారు పెగ్‌మార్కింగ్ నిర్వహించిన స్థలంలో సిమెంటు స్తంభాలు పాతిపెట్టి చేతులు దులుపుకున్నారు. రైల్వే స్థలం చుట్టూ ముళ్లకంచె వేయడంలో కబ్జాదారులతో కుమ్మక్కై ఆపి వేశారు. దీంతో మళ్లీ ఈ ఏడాది కూడా యథావిధిగా ఆ పొలంలో కబ్జాదారులు కౌలుకు ఇవ్వగా కౌలు దారులు వరి పంట సాగుచేస్తున్నారు. ఇప్పటికీ సరిగ్గా 130 ఏళ్ల క్రితం గుంతకల్లు - గుంటూరు రైల్వే లైన్ నిర్మించిన సమయంలో కుందూనదిపైభాగాన పెద్ద వాగు ఉండేది. ఈ వాగుకు వరదలు వస్తే రైల్వే లైన్ కొట్టుకుపోయేది. దీంతో అప్పట్లో రైల్వే ఉన్నతాధికారులు వరదకు అడ్డుకట్ట వేసేందుకు 22 ఎకరాల పొలాన్ని భూ సేకరణ కింద స్వాధీనం చేసుకొని పెద్ద కరకట్టను నిర్మించింది. కాలక్రమేనా ఈ కరకట్ట కరిగి పోవడంతో పొలంగా మారింది. 2009లో వచ్చిన భారీ వరదల కారణంగా మళ్లీ రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకుపోవడంతో రైల్వే అధికారులు వాగు ప్రాంతంలో హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించారు. దీంతో రైల్వే స్థలం రైల్వే శాఖకు ఉపయోగపడడం లేదు. దీన్ని ఆసరాగా తీసుకొని కబ్జాదారులు ఖరీదైన ఈ స్థలంపై కనె్నసి గతంలో మారుపేర్లతో అడంగల్‌లో సవరణలు చేసి క్రయ, విక్రయాలకు కూడా పాల్పడ్డారు. అయితే 2014 ఎన్నికల్లో స్థలాన్ని కబ్జా చేసి కౌన్సిలర్‌గా పోటీ చేసిన వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు రావడంతో రైల్వే అధికారులు మేల్కొని వారి స్థలాన్ని స్వాధీనం చేసుకొనే చర్యలో భాగంగా ముళ్లకంచె వేసేందుకు సిద్దమయ్యారు. అయితే గుత్తేదారు, కబ్జాదారులు కుమ్మక్కైన కారణంగా ముళ్లకంచె వేసేందుకు స్తంభాలను పాతి సరిపెట్టుకున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు విలువైన తమ స్థలాన్ని స్వాధీనం చేసుకొని పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటాలని ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్నారు.