కర్నూల్

నేడు హంద్రీనీవాకు నీరు విడుదల..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఆగస్టు 4 : కరవు కాటకాలకు నిలయమైన, తాగు, సాగునీరు అందక సతమతమవుతున్న రాయలసీమకు వరప్రదాయినిగా భావిస్తున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను నేటి నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతమైన మహారాష్టల్రో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండడంతో వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తుంది. గురువారం నాటికి శ్రీశైల జలాశయంలో నీటిమట్టం 830 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టుకు వరద నీరు 73,870 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వుండగా 7,063 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో వుందని అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయంలో శుక్రవారం తెల్లవారుజాము నాటికి నీటిమట్టం 836 అడుగులకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 836 అడుగులకు నీటిమట్టం చేరగానే హంద్రీనీవా నుంచి నీరు విడుదల చేసేందుకు అవకాశం వుంది. డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతితో శుక్రవారం మల్యాల వద్ద వున్న హంద్రీనీవా మొదటి ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా జలాలు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఇఇ పాండురంగయ్య తెలిపారు. గత ఏడాది తీవ్ర వర్షాబావ పరిస్థితుల వల్ల సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ చివరి వరకూ 7.8 టిఎంసిల నీటిని తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా నుంచి విడుదల చేశారు. అయితే ఈ ఏడాది ముందస్తుగానే భారీ వర్షాలు కురవడం వల్ల ఆగస్టు 5వ తేదీనే నీటి విడుదలకు రంగం సిద్ధం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో మరో వారం రోజుల్లో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులకు 215.8 టిఎంసిలకు నీరు చేరే అవకాశాలు వున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది హంద్రీనీవా కింద తాగునీటి అవసరాలతో పాటు సాగుకు కూడా నీరందించేందుకు అవకాశం వుందని అధికారులు పేర్కొంటున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలోని కృష్ణగిరి, పందికోన, జీడిపల్లె రిజర్వాయర్లు, 40 చెరువులను హంద్రీనీవా నీటితో నింపేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. హంద్రీనీవాకు గండ్లు పడకుండా వుండేందుకు, హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే కాలువలో ఎక్కువగా ప్రవహిస్తున్న నీటిని వెంటనే బయటకు పంపేందుకు రూ. 11కోట్లతో ఆరుచోట్ల ఎస్కేప్ ఛానల్ ఏర్పాటు చేశామన్నారు. మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లె వరకూ 216 కి.మీ మేరకు 8 పంపింగ్ స్టేషన్ల ద్వారా 1 టిఎంసి నీటిని ఎత్తిపోసేందుకు రూ. 13 కోట్ల విద్యుత్ వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు 2012లో ప్రారంభం కాగా తొలి ఏడాది 2, రెండవ ఏడాది 5, మూడవ ఏడాది 7, 2014-15లో 16 టిఎంసిల నీటిని రాయలసీమకు విడుదల చేశారు.