కర్నూల్

శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం నిర్వహించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 5 : శ్రీశైలం జలాశయం నీటి మట్టం 854 అడుగుల మేర నిర్వహించాల్సిందేనని, అంతకంటే తగ్గితే ఎట్టి పరిస్థితుల్లో దిగువకు నీరు విడుదల చేయవద్దని కర్నూలు జిల్లా పరిషత్ తీర్మానించింది. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. సాగునీటి శాఖకు సంబంధించిన చర్చ సందర్భంగా పిఎసి చైర్మన్, డోన్ వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి శ్రీశైలం నుంచి నీటి విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరవు సీమలో రైతులు కన్నీరు కారుస్తుంటే అట్టడుగున ఉన్న నీటిని సైతం దిగువకు విడుదల చేస్తే రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం నిండుతోందని ఆందోళన చెందవద్దని వారించారు. అయితే ఇప్పుడు వస్తున్న 2 లక్షల క్యూసెక్కుల నీటితో సమస్య పరిష్కారం కాదని ప్రతి ఏటా ఇలాగే వస్తాయంటే ఎలా అని బుగ్గన ఎదురుదాడికి దిగారు. తాము ఈ రోజు సమస్య గురించి మాట్లాడటం లేదని నిత్యం ఇలాగే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బిసి మాట్లాడుతూ తాము కూడా సిఎం చంద్రబాబు వద్ద నీటి విడుదలపై అసంతృప్తి వ్యక్తం చేశామని, అయితే కృష్ణా బోర్డు ఆదేశాలు, దిగువ ప్రాంత ప్రజల అవసరాల మేరకు నీటి విడుదల తప్పలేదని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. రాయలసీమ రైతుల సంక్షేమం దృష్ట్యా శ్రీశైలం జలాశయం నీటి మట్టం 854 అడుగుల మేర నిర్వహించాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదామని ప్రతిపాదించారు. ఇందుకు అధికార, ప్రతిపక్ష సభ్యులు అంగీకరించారు. అయితే జడ్పీ చైర్మన్ రాజశేఖర్ శ్రీశైలం జలాశయం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశమైనందున నీటి నిర్వహణ సాధ్యమేనా అనే అనుమానం లేవనెత్తారు. అయితే సభ్యులు సమావేశంలో తీర్మానం చేసి పంపిస్తే ప్రభుత్వం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొనడంతో తీర్మానాన్ని ఆమోదించారు.