కర్నూల్

పుష్కర పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లులు నిలిపివేత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఆగస్టు 5:కృష్ణా పుష్కర పనుల్లో నాణ్యత లోపిస్తే టెండర్ రద్దు చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవన్‌లో శుక్రవారం జడ్పీ చైర్మన్ రాజశేఖర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, మణిగాంధీ, బిసి.జనార్ధన్‌రెడ్డి, ఐజయ్య, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిపి.నాగిరెడ్డి, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, వీటిని కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో సంగమేశ్వరం వద్ద 3, శ్రీశైలం వద్ద 4 పుష్కర ఘాట్లు నిర్మించామన్నారు. ఘాట్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు పనులను నాశిరకంగా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే వాటిని పరిశీలించి వారి బిల్లులను నిలిపివేయటమే కాకుండా భవిష్యత్తులో ఎక్కడా కాంట్రాక్టు పనులు చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా పుష్కరాలకు వచ్చే ఏ భక్తుడు సౌకర్యాల లేమితో ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు నీరు విడుదల చేసి చెరువులు నింపుతామన్నారు. అలాగే అధికారులు రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలన్నారు. జడ్పీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఖచ్చితంగా ప్రొటోకాల్ పాటించాలన్నారు. శిలాఫలకంలో పేరు ఉంటుంది కానీ కార్యక్రమానికి సమాచారం లేకపోవడం వల్ల వాటికి హాజరుకాలేక పోతున్నారని వెల్లడించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల వరకూ నీరు నిల్వ వుంటేనే కిందికి విడుదల చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు స్పష్టం చేశారు. పిఎసి చైర్మన్ బుగ్గన మాట్లాడుతూ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. తన నియోజకవర్గంలో 2 బోర్లు, 2 సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని రెండేళ్ల పాటు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని వాపోయారు. అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు ఏకమై పుష్కర పనులను నాశిరకంగా చేపడుతున్నారని ఆరోపించారు. పుష్కరాలు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకూ పార్కింగ్ ప్రదేశాలను గుర్తించలేదని, ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి మాట్లాడుతూ మైనింగ్, పొల్యూషన్ బోర్డు అధికారులు, పరిశ్రమల శాఖల నిర్లక్ష్యం వల్ల అనేక మంది పేద విద్యార్థులు రోడ్డున పడాల్సి వచ్చిందని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా శాఖల అధికారులు బనగానపల్లెలో ఒక క్వారీకి బ్లాస్టింగ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వటం వల్ల కొత్తగా నిర్మించిన పాఠశాల భవనం బీటలు వారి పడిపోయే స్థితికి చేరుకుందన్నారు. ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ పుష్కరాల సమయంలో శ్రీశైలం, సున్నిపెంటల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. సాక్షర భారత్ ఉద్యోగులకు వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ కొత్తపల్లి మండలంలో పశువైద్యశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఎన్ని పంపుల ద్వారా నీళ్లు వదులుతారని ప్రశ్నించారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ పుష్కర పనులను వేగవంతంగా చేస్తున్నామని, సంగమేశ్వరంలో 3, శ్రీశైలంలో 4 ఘాట్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ సిఇఓ ఈశ్వర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.