కర్నూల్

సామాజిక సేవలో చిన్మయ మిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 13:స్వామి చిన్మయానంద మహారాజ్ 1951లో చిన్మయ మిషన్ సంస్థను స్థాపించారని సంస్థ అధ్యక్షుడు ఐ.విజయకుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి ఆచార్య విద్యా చైతన్య, ప్రధాన కార్యదర్శి టివి.రత్నప్రసాద్ తెలిపారు. నగరంలోని చిన్మయ మిషన్ విద్యా మందిరంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముంబయిలోని పవాయ్‌లో ఉన్న సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్టు కేంద్రంగా చేసుకుని విశ్వవ్యాప్తంగా 350 కేంద్రాల ద్వారా 400 మంది బ్రహ్మచారిణీ, బ్రహ్మచారుల ద్వారా ఆధ్యాత్మిక సాంస్కృతిక విద్యాసాంఘిక క్షేత్రాల్లో నిర్విరామంగా సేవ చేస్తుందన్నారు. బాలలు, యువకులు, పురుషులు, మహిళలకు జీవితంలో అన్ని దశల్లో ఆధ్యాత్మికత ఆవశ్యకతను వివరించడం, జ్ఞాన యజ్ఞముల ద్వారా భగవద్గీత ఉపనిషత్తులలోని వ్యవహారిక, ఆధ్యాత్మిక రహస్యాలను నేర్పిస్తారన్నారు. ఇక నగరంలో చిన్మయ మిషన్ శాఖ 2001లో ప్రాంరభించారన్నారు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో బాలవిహార్, చిన్మయ యువ కేంద్రం, చిన్మయ దేవి గ్రూపులు, స్టడీ గ్రూపులు, చిన్నయ భగవద్గీత పఠన పోటీలు, వేసవి చిన్మయ బాలల సంస్కార సాధన శిబిరాలు ఏర్పాటు చేయుట, యువతలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించే శిక్షణలు, అనాథలు, వృద్ధులకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

నేడు పూజ్య స్వామి తేజోమయానందజీ కర్నూలు రాక
ప్రపంచ చిన్మయ మిషన్ అధ్యక్షుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పూజ్య స్వామి తేజోమయానందజీ ఈ నెల 14వ తేదీ కర్నూలు నగరానికి వస్తున్నట్లు మిషన్ సంస్థ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో తేజోమయానందజీ నగరంలోని వెంకటరమణ కాలనీలో చిన్మయ ప్రభావళి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, సాయంత్రం 5గంటలకు స్థానిక లక్ష్మీవేంకటేశ్వర కల్యాణ మండపంలో జరిగే సంగీత స్వరాలాపన, నృత్య ప్రదర్శనకు హాజరవుతారని తెలిపారు. అలాగే 8గంటలకు సద్గురువు సర్వోత్తమ సేవ అంశంపై ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో చిన్మయ మిషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు, కోశాధికారి కె.మహేష్, తదితరులు పాల్గొన్నారు.