కర్నూల్

సర్వే 66.02 శాతం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, సెప్టెంబర్ 19: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ఈనెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉందని ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం లో సోమవారం ఆయన మాట్లాడుతూ నంద్యాల డివిజన్ పరిధిలోని 17 మం డలాల్లో 572మంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారని, ఇప్పటి వరకు 66.02 శాతం సాధికార సర్వేను పూర్తి చేసినట్లు తెలిపారు. నంద్యాల రెవె న్యూ డివిజన్ పరిధిలోని కొలిమిగుండ్ల మండలంలో 84.25శాతం, కోవెలకుంట్లలో 83.45, దొర్నిపాడు 82.39, అవుకు 79.14, నంద్యాల 73.45, సంజామల 71.43, శిరివెళ్ల 70.21, రుద్రవరం 67.77, గోస్పాడు 68.80, ఉయ్యాలవాడ 66.29, మహానంది 63.03, ఆళ్ళగడ్డ 60.92, బండి ఆత్మకూరు 60.88, పాణ్యం 60.20, గడివేముల 53.24, బనగానపల్లె 51.94, చాగలమర్రిలో 43.15 శాతం సాధికార సర్వే పూర్తి చేశామన్నారు. నంద్యాల పరిధిలో సాధికార సర్వే శాతం చాలా వెనుకబడి ఉందని, ఈనెల 25వ తేదీ లోపల సాధికార సర్వే పూర్తి చేసేందుకు అవసరమైతే అదనంగా ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేసి వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణను ఆదేశించినట్లు ఆర్డీఓ తెలిపారు. సాధికార సర్వేలో వెనుకబడిన మండలాల్లో ఈనెల 25వ తేదీ లోపల ఎటువంటి పరిస్థితుల్లో సాధికార సర్వే పూర్తి చేయాలని సంబంధిత తహశీల్దార్లను ఆదేశించినట్లు తెలిపారు.