కర్నూల్

టనె్నల్ బిల్లుల చెల్లింపులో జాప్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, సెప్టెంబర్ 19: గాలేరు-నగరి సుజల స్రవంతి వరద కాలువ అంతర్భాగంగా నిర్మాణం జరుపుకుంటున్న అవుకు టనె్నల్ పనులు ఈ మధ్య కాలంలో వేగం పుంజుకున్నాయి. అయితే బకాయి చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులను సజావుగా సాగిస్తాడా అనే ప్రశ్న మొదలవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గత రెండు నెలలుగా జిఎన్‌ఎస్‌ఎస్ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరగలేదని తెలుస్తోంది. పోతిరెడ్డిపాడు నుంచి అవుకు వరకూ వున్న ప్యాకేజీ పనులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ. 21 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో అవుకు టనె్నల్ నిర్మాణాలకు రూ. 8.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా గత రెండు నెలలుగా బిల్లుల చెల్లింపులు జరగలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే టనె్నల్ నిర్మాణ పనుల్లో మరింత జాప్యం జరగడమో లేదా కాంట్రాక్టర్ ఉన్నఫళంగా పనులను నిలిపివేసే ప్రమాదం లేకపోలేదు. గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తగా సంబంధిత కాంట్రాక్టర్ పనులను పూర్తిస్థాయిలో నిలిపి వేసిన విషయం తెలిసిందే. టనె్నల్ నిర్మాణ పనులు ప్రారంభమై పదేళ్లయినా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం రాయలసీమ ప్రజల స్వప్నమైన గాలేరు-నగరి వరద కాలువ పనులు సజావుగా సాగి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.