కర్నూల్

హంద్రీనీవా పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవనకొండ, సెప్టెంబర్ 19: హంద్రీనీవా సుజల స్రవంతి పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హంద్రీనీవా అధికారులను, కాంట్రాక్టర్లను కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని కప్పట్రాళ్ళ, జిల్లేడుబుడకల, పల్లెదొడ్డి, నెలతలమర్రి గ్రామాల్లో హంద్రీనీవా కాల్వల పనులను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులు చేయాల్సిన నిర్దేశిత సమయం గడిచిపోయి చాలా కాలం అవుతున్నప్పటికి పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాల్వల తవ్వకానికి అడ్డంగా ఉన్న తారు రోడ్డులను సైతం వెంటనే తొలగించి హంద్రీనీవా కాల్వల పనులను పూర్తి చేయాలన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల హంద్రనీవా నీటిని ఇప్పటి వరకు రైతులకు అందించలేకపోయామని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఆదోని ఆర్డీఓ ఓబులేసు, హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, తహశీల్దార్ తిరుమలవాణి, ఆయాగ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.