కర్నూల్

ప్రజా సంక్షేమమే టిడిపి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, సెప్టెంబర్ 19:ప్రజల సంక్షేమమే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. మండలాన్ని సస్యశ్యామలం చేసే సిద్దాపురం ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణంలోని గుండ్లకమ్మ వాగులో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించి నీరు సక్రమంగా బయటికి వెళ్లేవిధంగా చేపట్టిన పనులను సోమవారం ఎమ్మెల్సీ శిల్పా, ఎమ్మెల్యే బుడ్డా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పనులకు రూ. 54 లక్షలు మంజూరయ్యాయన్నారు. గుండ్లకమ్మ వాగులో అక్రమంగా నిర్మించినన కట్టడాలను తొలగిస్తామన్నారు. 40 అడుగుల వెడల్పుతో పూడిక తీసి పట్టణ శివారులో ఉన్న భవనాశి వాగుకు కలుపుతామన్నారు. గత కొనే్నళ్లుగా నెలకొన్న సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. వాగు వెడల్పులో ఇల్లు కోల్పోయిన వారికి స్థలం, ఇల్లు నిర్మిం చి ఇస్తామన్నారు. రైతుల పంటలు ఎండిపోకుండా ఎస్‌ఆర్‌బిసి కాలువ నుంచి కెసి కెనాల్‌కు పంపుల ద్వారా నీరు విడుదల చేస్తున్నామన్నారు. రైతులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నూర్‌అహమ్మద్, ఎంపిపి సౌజన్య, ఎంపిటిసి రాముడు, కమిషనర్ ప్రహ్లాద, నేతలు వంగాల శివరామిరెడ్డి, యుగంధర్‌రెడ్డి, జయకృష్ణ, నాగుర్, గౌస్ పాల్గొన్నారు.