కర్నూల్

కనువిందు చేస్తున్న జలపాతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, సెప్టెంబర్ 19 : మండలంలో వారం రోజుల క్రితం 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి కొండలు, కోనలు, వాగులు, వంకల్లో నీరు ఉప్పొంగి ప్రవహించాయి. వర్షం కురవక ఐదు రోజులు గడిచినప్పటికీ జలపాతాలు ప్రజలకు కనువిందు చేస్తూనే ఉన్నాయి. మండల పరిధిలోని మెట్టుపల్లె గ్రామ సమీపంలో సొరంగ నిర్మాణాల వద్ద ఉన్న జలపాతం ప్రజలకు కనువిందు చేస్తుందని చెప్పవచ్చు. ఈ జలపాతం కింద స్నానం చేసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్నారు. పర్యాటకులు ఎక్కువగా రావడంతో మెట్టుపల్లె గ్రామపంచాయతీ అధికారులు టోల్‌గేట్ వసూలుకు శ్రీకారం చుట్టారు. ఒకసారి వర్షం కురిస్తే 15 రోజుల వరకూ జలపాతాలు ప్రవహిస్తుండటంతో పర్యాటకులు చూసేందుకు పెద్దఎత్తున తరలివస్తున్నారు.