కర్నూల్

అవసరమైతే రాత్రి పని చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 19:రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజా సాధికార సర్వే పనులు పూర్తి చేయడానికి అవసరమైతే ఎన్యూమరేటర్లు రాత్రివేళల్లో కూడా పని చేయాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. సర్వే కార్యక్రమం నత్తనడకన కొనసాగుతున్న తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేపై సమీక్ష నిర్వహించేందుకు సోమవారం కలెక్టర్ అన్ని మండలాల తహశీల్దార్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్వే కార్యక్రమం 61శాతం మాత్రమే పూర్తయిందన్నారు. డోన్, పాములపాడు, కొత్తపల్లె, బేతంచెర్ల, సి.బెళగల్, చాగలమర్రి, బనగానపల్లె, గడివేముల, తుగ్గలి, నందవరం, దేవనకొండ, పెద్దకడబూరు మండలాల్లో 50 శాతం కంటే తక్కువ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే పనులు పూర్తి చేసేందుకు వెల్దుర్తి, రుద్రవరం, బనగానపల్లె మండలాల్లో పలువురు ఎన్యూమరేటర్లు రాత్రి వేళల్లో కూడా సర్వే కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారి పని తీరును అభినందించారు. సర్వే శరవేగంగా పూర్తి కావడానికి ఇతర ఎన్యూమరేటర్లు కూడా అవసరమైతే రాత్రివేళల్లో పని చేయాలని సూచించా రు. ఈ నెల 25వ తేదీ తరువాత ఎలాం టి సమాధానం వినే ప్రసక్తే లేదని ఆ రోజుకు సర్వే పనులు పూర్తి కావాల్సిందేనని నిర్ధేశించారు. రానున్న రెండు రోజుల్లో మరోమారు సమీక్షిస్తానని ఆ రోజుకు సర్వే పని పురోగతి సాధించకపోతే సంబంధిత అధికారులపై చర్య లు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జాతీయ రహదారుల పక్కనే 25 ఎకరాల ప్రభు త్వ భూమిని గుర్తిం చి నివేదిక సిద్ధం చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల సరిహద్దులను గుర్తించి ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో సర్వే 87శాతం పూర్తయిందని తెలిపారు. ఎన్యూమరేటర్లతో పాటు సంబంధిత అధికారులు సర్వేలో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఎన్నికల ఓటర్ల జాబితాకు సంబంధించి ఫొటో మ్యాచింగ్, ఇతర సవరణలను కూడా ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. పోలింగ్‌స్టేషన్ల సరిహద్దులను కూడా ఇసిఐ వైబ్‌సైట్‌లో పొందుపరచాలన్నారు.
ఇక ఈ-ఆఫీస్
జిల్లాలో ఈ నెల 21వ తేదీ నుంచి ఈ-ఆఫీస్ విధానం అమలు చేయాలని జెసి హరికిరణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫిజికల్ ఫైల్స్ కాకుండా ప్రభుత్వ వ్యవహారాలు ఈ-ఆఫీస్ విధానంలో కొనసాగాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఇచ్చిన ట్యాబ్‌లలో ‘కైజలా’ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. అప్లికేషన్ డౌన్‌లోడ్ సమస్య ఎదురైతే తక్షణం సంబంధిత అధికారులకు వివరించి తగిన సూచనలు పాటించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులు శరవేగంగా చేపట్టి ప్రజలు రోగాల బారిన పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టిన పనులపై ఎప్పటికప్పుడు సిఎం డ్యాష్ బోర్డుకు నివేదించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా అభివృద్ధి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో చిన్నతప్పిదాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తామని అందరూ ఈ విషయాన్ని గ్రహించి పని చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.